CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళా చట్టాలు పటిష్టంగా అమలవుతున్నాయి.. : t కొత్తగూడెం కోర్టు జిల్లా మొదటి అదనపు జడ్జి దీప..

Share it:


 మన్యం న్యూస్, చండ్రుగొండ ,నవంబర్ 2 : మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలని కొత్తగూడెం జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి దీప అన్నారు.బుధవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మండల లీగల్ సెల్ ( కొత్తగూడెం) నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటేనే సమాజంలో సమానత్వం దక్కుతుందన్నారు. ప్రశ్నించినది న్యాయం దక్కదని,ప్రశ్నిస్తేనే హక్కులు వస్తాయన్నారు. బాలబాలికల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి వివక్షత చూపించకూడదన్నారు. అన్ని రంగాలలో ఆడ,మగ అన్న తేడాలేకుండా సమానవేతనాలు, హక్కులు పొందుతున్నారన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం దక్కాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలకార్మికులుగా ఎవరైనా పనిచేస్తుంటే వెంటనే సంబంధిత అధికారులకుసమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ కమిటీ సభ్యులు షాదిక్ పాషా,రాజమల్లు,ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి,జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఉప సర్పంచ్ బాబురావు, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం మంజుశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: