CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన పండుగలు జాతరలు

Share it:

 1) నాగోబా జాతర 
  2) సమ్మక్క సారలమ్మ జాతర
 3) నిషాని దేవత 
 4)  పెద్ద దేవుడు 
 5) పెర్సపెన్ 
 6) అకిపెస్ 


 1) నాగోబా జాతర : 

*  అదిలాబాద్ జిల్లాలోని గోండులు నాగోబా జాతరను ప్రతి సంవత్సరం 'మాఘమాస పౌర్ణమి' రోజున జరుపుకుంటారు.
*  ఇది ఉట్నూర్ మండలంలో కేస్లాపూర్ అనే గ్రామంలో (ఐటీడీఏ హెడ్ క్వార్టర్ కి 20 కిలోమీటర్ల దూరంలో) జరుపుకుంటారు.
*  నాగోబా గిరిజన తెగ అయినా గోండుల ఆరాధ్యదైవం.
*  నాగోబా అనగా పాముని దేవతా రూపంలో పూజిస్తారు.
*  ఈ సందర్భంగా ఈ తెగ వారు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 
*  ఇక్కడ భీమ దేవుని ఆలయంలో రాత్రంతా నాట్యాలతో గడుపుతారు, ఆదిశేషునికి పూజలు చేస్తారు. 
* 1940లో  ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్  అనే స్కాలర్  నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్ ను నిర్వహించి దానికి జిల్లా కలెక్టర్ ను ఆహ్వానించి వారి సమస్యలను విన్నవించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. 

 2)  సమ్మక్క సారలమ్మ జాతర (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
* ఈ జాతర పవిత్రత దైవత్వం మరియు చరిత్రల మిశ్రమంగా చెప్పవచ్చు. ఈ జాతరలో సమ్మక్క దేవత రూపంలో పూజలందుకుంటుంది. క్రీస్తుశకం 13వ శతాబ్దంలో కాకతీయుల సామంతరాజు అయినా పడిగిద్ద రాజు మేడారం ప్రాంతాన్ని పరిపాలించాడు. ఒక సంవత్సరం కరువు వల్ల పగిడిద్దరాజు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని కప్పం చెల్లించక పోవడంతో కాకతీయ సేనాపతి యుగంధరుడు మేడారం పై దండెత్తుతాడు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు మరియు అతని సేనాని జంపన్న మరణిస్తారు. ఈ జంపన్న పేరు మీదనే జంపన్న వాగు పేరు వచ్చింది.  ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క సారక్కలు  తమ గిరిజన పరివారంతో కాకతీయ సేనాపతి యుగంధరుడితో వీరోచితంగా పోరాడారు.  ఈ పోరాటంలో సమ్మక్క మరణించగా సారక్క అడవిలోకి వెళ్లి పోయింది.  ఈ యుద్ధంలో సమ్మక్క-సారలమ్మల చూపిన సాహసం, త్యాగం వారిని ఆరాధనీయ దేవతామూర్తులుగా చేశాయి. సమ్మక్క  సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో తో గుర్తింపు పొంది ప్రసిద్ధికెక్కింది.  సుమారు రెండు కోట్ల మంది ఈ జాతరకు వస్తారు.  దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 01/02/1996 న ఈ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.  దీనిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో పౌర్ణమి రోజున జయశంకర్ భూపాలపల్లి  జిల్లా మేడారం లో జరుపుకుంటారు.   ఈ జాతరలో పూజారులు గిరిజనులు.  ఈ జాతరకు గిరిజనులు కంటే గిరిజనేతరలు  ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు.  సమ్మక్క సారక్క జాతర మొత్తం నాలుగు రోజులు జరుగుతుంది.  మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో ఉన్న గడ్డపై సమ్మక్క ను ప్రతిష్ఠిస్తారు. మూడవరోజు గద్దెలపై అమ్మవారు ఇద్దరిని కొలువు చేస్తారు. నాలుగవరోజు  ఆవాహనం పలికి   సాయంత్రము నా అమ్మవారులిద్దరిని కొలువు చేస్తారు  తిరిగి యుద్ధరంగానికి తరలిస్తారు దీనితో జాతర ముగిస్తుంది.                                                             *మన్యంటీవీ ప్రతినిధి చంటి  అశ్వారావుపేట.
Share it:

ARTICLES

TELANGANA

Post A Comment: