CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

Pawan, Chandrababu, Rahul రిక్వెస్ట్‌ పాలిటిక్స్‌..

Share it:

 


 ''ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. నేనేంటో నిరూపించుకుంటా'' ఈ ఫేమస్‌ సూపర్‌ హిట్‌ సినిమా డైలాగ్‌ ఇదిప్పుడు పొలిటికల్‌ తెరపై పేలుతోంది.  సినిమాల్లో వేషం కోసం ఆర్టిస్టులు రిక్వెస్ట్‌ చేస్తే.. ఇప్పుడు అధికారం కోసం రాజకీయ నాయకులు రిక్వెస్ట్‌ చేయడం సాధారణంగా మారింది. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌ అంటూ మైకులు పగిలిపోయే రేంజ్‌లో రిక్వెస్టు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  Pawan, Chandrababu, Rahul  రిక్వెస్ట్‌ పాలిటిక్స్‌.. దేశ రాజకీయాల్లోల కొత్త ట్రెండ్‌ మొదలైంది.. ఇన్నాళ్లూ తాము ఏం చేశాం.. గెలిపిస్తే ఏం చేస్తాం.. అని చెప్పి నాయకులు ఎన్నికల్లో ఓట్లు అడిగేవారు.. కానీ ఇప్పుడు రిక్వెస్ట్‌ పాలిటిక్స్‌ మొదలయ్యాయి. వివిధ పార్టీల అధినేతలు అధికారం కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. 'ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌' అంటూ వేడుకుంటున్నారు. 130 ఏళ్ల చరిత్ర.. సుమారు 50 ఏళ్లు దేశాన్ని పాలించిన ఘటన ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, 

ఏపీ రాజకీయాల్లో స్పీడు పెంచిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రిక్వెస్ట్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. తాజాగా సవన్‌ నోటివెంట ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ మాట రావడంతో.. మరోసారి ఈ డైలాగ్‌ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.  మొన్న బండి.. నిన్న రాహుల్‌.. నేడు పవన్‌.. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్న ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ డైలాగ్‌.. సర్వత్రా చర్చనీయాంశమైంది. మొదట ఈ డైలాగ్‌ను బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌కుమార్‌ పొలిటికల్‌ తెరపైకి తెచ్చారు. పాదయాత్ర సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన సభలో అమిషా సమక్షంలో తమకు రాష్ట్రంలో ఒక్కసారి అధికారం ఇవ్వాలని మాటాలడిన బండి సంజయ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నాయకులు సెటైర్లు కూడా వేశారు. మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్లీజ్‌.. ప్లీజ్‌ అంటే అధికారం ఇస్తారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ డైలాంగ్‌ అందుకున్నారు. మహారాష్ట్రలో యాత్ర చేస్తున్న రాహుల్‌ కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని ప్రజలను వేడుకుంటున్నారు. దాదాపు 50 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌.. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. అయితే.. మోదీ ప్రభావంతో రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ వస్తోంది. ఈక్రమంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కోసం రాహుల్‌ భారత్‌ జోడో పేరుతో యాత్ర చేస్తున్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ నేత ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ రిక్వెస్ట్‌ చేయడం ఆసక్తిగా మారింది. తాజాగా పవన్‌ నోట ఆ మాట.. సినిమావాళ్లు పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి సూపర్‌ హిట్‌ అయిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, ఎప్పటికీ సినిమాలు, రాజకీయాలు ఒక్కటి కానేకాదు. ఈ రెండు రంగాల్లో సక్సెస్‌ అనేది అందరికీ అంత ఈజీ కూడా కాదు. అందుకే.. వెండితెర మీదైనా, పొలిటికల్‌ స్క్రీన్‌ మీదైనా ఒక్క ఛాన్స్‌ అనేది చాలా కీలకమని అర్థమవుతోంది. సినిమాల్లో తనకంటూ ఒక స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగానూ తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి ఓడినా.. ఆయన రాజకీయాలను వదల్లేదు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. అధికార పక్షంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు మరోమారు రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు.. పొలిటికల్‌ కారిడార్‌లో వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ అనే డైలాగ్‌ను మరోసారి తెరమీదకు తీసుకొచ్చాయి. అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో, నా పరిపాలనా విధానం ఏంటో చూపిస్తాం అంటూ పవన్‌ అభ్యర్థించడం పొలిటికల్‌గా మరోసారి చర్చకు దారి తీసింది. ''ఉత్తరాంధ్ర మీద ఒట్టు మీ భవిష్యత్తుకు నాది భరోసా'' అంటున్నారు. విద్యనేర్పి.. సినిమా జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగించాలంటూ సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు. కాకపోతే, గతానుభవాల దృష్ట్యా ఈ డైలాగ్‌ పవర్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వ¯Œ ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసిన పొలిటికల్‌ ఘటనలు లేకపోలేదు.    pawan kalyan  ఆ డైలాగ్‌తో అధికారంలోకి జగన్‌.. 2014లో తృటిలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్‌.జగన్‌ ప్రతిపక్ష నేతగా అప్పట్లో అందుకున్న స్లోగన్‌ ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌. నాటి టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. 3,648 కిలోమీటర్ల దూరం నడిచిం రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయ దగ్గర 2017 నవంబర్‌ 6న ఆరంభమైన ఈ పాదయాత్రం 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దగ్గర ముగిసింది. దెబ్బకు అధికారం ఆయన పక్షాన నిలిచింది. పాదయాత్రలో ఆయన వాడిన ఒకే ఒక్క స్లోగన్‌ వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌. ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి రాజశేఖరరెడ్డిని మించిన సంక్షేమ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కటి మాత్రం నిజం ''ఒక్క అవకాశం ఒకే ఒక్క అవకాశం'' అంటూ జగన్‌ చేసిన అభ్యర్థన ఏపీ ప్రజలపై బాగా పనిచేసింది.  మంగళగిరిలో పనిచేయని స్లోగన్‌.. టీడీపీ హయాంలో ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్‌ మంత్రిగా.. అసలు మొత్తంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నారాలోకేశ్‌ మంగళగిరిలోనూ ఒక్క ఛాన్స్‌ ప్లీస్‌ స్లోగన్‌ ఉపయోగించారు. ''ఒక్క అవకాశమివ్వండిం మీకు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను.. నన్ను నమ్మండి'' అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఏం చేస్తాం.. బ్యాడ్‌ లక్‌. సేమ్‌ మంత్రం జగన్‌ వేస్తే పనిచేసింది.. లోకేశ్‌ వేస్తే మాత్రం సరిగ్గా పారలేదు. సీఎం కొడుకుగా ఉండి ఎన్నికల్లో నిలబడినా ఓటమిని మూగట్టుకోక తప్పలేదు. ఓడినా.. మంగళగిరిలోనే తిష్టవేసి తన వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ అనే డైలాగ్‌ను పదేపదే వినిపిస్తూనే ఉన్నారు లోకేశ్‌. మరి, ఈసారైనా ఆయనను విజయం వరిస్తుందా? వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ మంత్రం పనిచేస్తుందా? అన్నదే టీడీపీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతోంది. త్వరలోనే ఆయన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సైతం సిద్ధమవుతుండటంతో విషయం మరింత ఇంట్రస్టింగ్‌ మారింది.  ఏపీ బీజేపీ చీఫ్‌ కూడా.. ఏపీ రాజకీయాల్లో జనసేనానితోపాటు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సైతం వన్‌ ఛాన్స్‌ ప్లీజ్‌ అంటున్నారు. అటు టీడీపీ కీలక నేతగా నారా లోకేశ్‌ సైతం ఒక్క అవకాశం అంటున్నారు. ఇక ఇప్పటికే వన్‌ ఛాన్స్‌ అంటూ అధికారం దక్కించుకుని గద్దెమీదున్నారు జగన్‌. ఇంకోవైపు దేశవ్యాప్తంగా నాకో ఛాన్స్‌ కావాలంటున్నారు రాహుల్‌గాంధీ. మరి, ప్రజలు ఈసారి ఎవరికి ఛాన్స్‌ ఇస్తారో చూడాలి.

Share it:

AP

Post A Comment: