CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇక 2000 నోటు కనిపించదు

Share it:

 


పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ₹2000 నోటును తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల మినహా అన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ₹500 నోట్లే పంచారు..  దీనివల్ల అభ్యర్థులు నగదు పంచేందుకు ఇబ్బందులు పడ్డారు. హవాలా మార్గంలో కూడా భారీ ఎత్తున ₹500 నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఒకవేళ ₹2000 నోట్లు గనుక ఉండి ఉంటే అధికారులు కూడా పట్టుకోలేకపోయేవారు. ఇక గత కొంతకాలం నుంచి మార్కెట్లో ₹2000 నోట్లు కనిపించడం లేదు. ఇటీవల ఒక సంస్థ సమాచార హక్కు చట్టం కింద ₹2000 నోట్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. షాకింగ్ సమాచారాన్ని బయటపెట్టింది.  Rs 2,000 Notes  ఇంతకీ ఏం చెప్పిందంటే  మూడేళ్ల నుంచి ₹2000 కోట్ల ముద్రణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

అన్ని ప్రాంతాలకు సమానంగా ఆ నోట్లు పంపిణీ చేయలేకపోతుండటం వల్లే నిలిపివేసినట్టు తెలిపింది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ₹500, వెయ్యి నోట్లను రద్దు చేసింది. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో ఆ నోట్ల వాటా 80 శాతానికి పైగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని మింట్ కాంపౌండ్లు నిర్విరామంగా పనిచేసినా అంత భారీ స్థాయిలో కరెన్సీని త్వరగా ముద్రించడం కష్టమే. అందుకే ₹2000 నోట్ల ముద్రణను మొదలుపెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్ తగ్గించింది.. 2016_17 ఆర్థిక సంవత్సరంలో ₹35, 429.91 కోట్ల ₹2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించింది. 2017_2018 సంవత్సరానికి గాను ₹1,115.7 కోట్ల _2000 నోట్లను, 2018_19 సంవత్సరానికి గాను _466.90 కోట్ల ₹2000 నోట్లను ముద్రించింది. 2019 నుంచి పూర్తిగా వేసింది.  

నకిలీ నోట్లు పెరిగాయి  పెద్ద నోట్ల రద్దు వల్ల నకిలీ నోట్ల బెడద తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ అందుకు విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయి. 2015లో రిజర్వ్ బ్యాంక్ మహాత్మా గాంధీ సిరీస్ 2005లో భాగంగా కొత్త నెంబర్ సిస్టంతో కూడిన అన్ని డి నామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. వీటిలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. అసలు నోట్లకు, నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు కూడా స్పష్టంగా గమనించేవారు. కానీ పెద్ద నోట్లను రద్దు చేసి ₹2000 నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016 లో దేశవ్యాప్తంగా 2, 272 నకిలీ ₹2000 నోట్లు పట్టు పడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు ₹2.45 లక్షలకు చేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది.. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించింది.    Rs 2,000 Notes  మునుగోడు లో ఎలా ఉన్నట్టు  రిజర్వ్ బ్యాంక్ ₹2000 నోట్ల ముద్రణ నిలిపివేసినప్పటికీ మన మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్నిచోట్ల ₹2000 నోట్లు కనిపించాయి. ముఖ్యంగా అధికార పార్టీ వీటిని ఎక్కువగా పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నోట్లు మొత్తం వివిధ మార్గాల ద్వారా మునుగోడు చేరినట్టు సమాచారం. అయితే హవాలా మార్గంలో పెద్దనోట్లు చేరుతుంటే వీరికి అవి ఎలా అందుతున్నాయి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Share it:

NATIONAL

Post A Comment: