CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లని రెగ్యులర్ చేయాలి. టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి రాజు..

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 3::

జిల్లా వ్యాప్తంగా అన్ని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు రెగ్యులర్ చేయాలని కోరుతూ గత నెల 29వ తారీకు నుండి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బి రాజు ఆర్లగూడెం పాఠశాలలో డైలీ వర్కర్ల ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఆశ్రమ పాఠశాలలో, సంక్షేమ హాస్టల్లో సరిపడినంత మంది రెగ్యులర్ వర్కర్స్ లేరు  డైలీ వేజ్ వర్కర్లు మాత్రమే పాఠశాల విద్యార్థులకు వండి పెడుతూ ,పాఠశాలను శుభ్రం చేస్తూ ,బాత్రూంలు టాయిలెట్స్ క్లీన్ చేస్తూ, పనిచేస్తున్నారు. వారిని గుర్తించే ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరారు ఇదే డైలీ వేజ్ వర్కర్ పనిని ఆధారం చేసుకుని వారి కుటుంబాలను పోషిస్తున్నారు వారికి వేరే జీవనాధారం ఏమి లేదు కాబట్టి ఐటీడీఏ ఉన్నతాధికారులు అయినటువంటి డిడి ట్రైబల్ వెల్ఫేర్,  ప్రాజెక్టు అధికారి  డైలీ వర్కర్లను రెగ్యులర్ వర్కర్లుగా నియమించే విధంగా ప్రతిపాదనలు కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ ప్రతిపాదన పంపాలని అన్నారు అదేవిధంగా డైలీ వేజ్ వర్కర్స్ పనిచేసిన కాలానికి సంబంధించిన వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కే జోగారావు ప్రధాన కార్యదర్శి బి రవి జిల్లా కౌన్సిలర్ బి క్రాంతి కిరణ్ ఉపాధ్యాయులు మరియు ధర్నా చేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: