CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ముస్లిం మైనారిటీ పాఠశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట నవంబర్ 11:  అశ్వారావుపేట పట్టణంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు జరిగిన మౌలానా అబ్దుల్ కాలమ్ ఆజాద్ పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏటా నవంబర్ 11న   తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ డే నీ ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా మండల ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మొదటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా చేసిన  మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినంరోజు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ డే గా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో 208 మైనారిటీ పాఠశాలలు కలవు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మైనారిటీ విద్యార్థికి ఒక సంవత్సరానికి లక్ష 19 వేల రూపాయలు ఖర్చు పెడుతుందని విద్యార్థులు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఉద్దేశంతో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలలో ఐదు రకాల భాషలలో విద్యను అందిస్తున్నారని, వాటిలో  హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, అరబ్బీ, తెలుగు భాషలలో విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లిం మైనారిటీ సొసైటీ ప్రిన్సిపల్ అయిన సంగీత మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ పాఠశాలలో బెస్ట్ ప్రిన్సిపల్ గా అవార్డు తీసుకోవడం చాలా సంతోషం అని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి మాట్లాడుతూ ఆయన ఎన్నో పుస్తకాలు రాయడం జరిగిందని అందులో "ఇండియా వింగ్స్ ఫ్రీడం" అనే పుస్తకం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని 14 సంవత్సరాలు వరకు ఉచిత నిర్బంధ విద్య ఉండాలని, విద్య మన జన్మ హక్కు అని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 1951 లోనే ఖరగ్ పూర్ లో ఐఐటి విద్య విద్యాలయం స్థాపించి విద్య యొక్క ప్రాముఖ్యతను అప్పుడే తెలియజేశారు. మా పాఠశాల సిబ్బంది 24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటూ మీ పిల్లలే మా పిల్లలు అనే భావంతో పనిచేస్తామని భోజన విషయంలో గాని సెక్యూరిటీ విషయంలో గాని మెయింటినెన్స్ విషయంలాగాని ఎలాంటి సమస్యల ఉన్న మా దృష్టికి తీసుకురావాలన్నారు అలాగే ఏమైనా సమస్యలు ఉంటే అధిగమించడానికి తల్లిదండ్రులుగా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు, గత సంవత్సరం 2021- 22 కి పాఠశాలలో ఉత్తీర్ణతలో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించామని అలాగే 2022- 23 లో కూడా పది కి పది శాతం ఉత్తీర్ణత గ్రేడ్ పాయింట్ల సాధిస్తామని కార్పొరేట్ విద్యకు దీటుగా ఏమాత్రం తీసుకొని విద్య మరియు ఉన్నత చదువులు మైనారిటీ పాఠశాల అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పాఠశాలలో విద్యార్థినీ చిన్న వయసులోనే  ఖురాన్ మొత్తం చదివిన విద్యార్థినిలకు ప్రోత్సాహంగా బహుమతులు అందజేసినారు విద్యార్థినులు చేసిన నృత్యాలు  పిరమిడ్ ఆకారలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, స్థానిక సర్పంచ్ అట్టం రమ్య. అశ్వారావుపేట ఎంపీటీసీ వేముల భారతి, నండ్రు జయభారతి, కో ఆప్షన్ సభ్యులు పాషా, తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్  బాబా, ఆసిఫ్ ఆలీ, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: