CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట రేగా

Share it:


-ప్రజల కోసం నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం.

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు 


మన్యం న్యూస్ బూర్గంపాడు నవంబర్ 20: మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం కోసం, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్పత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న సంకల్పంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ఆధునికరించడం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో నూతన భవనాన్ని మంజూరు చేపించి నిర్మిస్తామన్నారు. డాక్టర్ అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఆపరేషన్ థియేటర్ తో పాటు ఇతర సామాగ్రి కొరకు 50 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుంది. త్వరలోనే అందుబాటులోకి వస్తాదన్నారు. 70 లక్షల రూపాయలు నిధులను ప్రహరీ గోడ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అన్నారు. పేద మధ్య తరగతి ప్రజల కోసం నాణ్యమైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది అన్నారు. పినపాక నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వ వైద్యం తీసుకురావడంతో పాటు రాబోయే రోజులలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు నిర్మాణం జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ 157 కాలేజీలు ఇచ్చింది కానీ తెలంగాణకు మొండి చేయి చూపిందని అన్నారు. ఇక్కడ బిజెపి నేతలు మాటలు కోటలు దాటుతున్నాయని మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి మొండి చేయి చూపిన సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో సొంతగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: