- రెండైన అభిమానం
- రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మండల కార్యాలయంలో, ఏడూళ్ల బయ్యారం గ్రామంలో
- వర్గపోరు జరుగుతుందని ముచ్చటించుకుంటున్న జనాలు
మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో భట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండగా మరో వర్గంగా ఏర్పడి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఏమిటని, వర్గపోరు జరుగుతుందని మండల ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
Post A Comment: