CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన

Share it:


  • డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన
  • ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం : ఎస్పీ డా.వినీత్.

మన్యం న్యూస్,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్01.. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రతి నెల ఒకటో తేదీన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో చేపట్టిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం విజయవంతమైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.. ఉదయం 11.30 నుంచి గంట పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మొత్తం 19 ఫిర్యాదులు సమస్యలను స్వీకరించడం జరిగిందని తెలిపారు.బాధితుల సమస్యల పరిష్కారం కొరకు వెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.ఈ సమయంలో ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలుసుకోలేని బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చి నేరుగా తమని సంప్రదించవచ్చని కోరారు.ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన ఈ "డయల్ యువర్ ఎస్పీ"కార్యక్రమం ఉంటుందని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: