CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండల తొలి మహిళ ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి తో మన్యం న్యూస్ ప్రతినిధి ఇంటర్వ్యూ...

Share it:


1. మీరు గ్రామం, జిల్లా, అమ్మానాన్న పేర్లు..

 గ్రామం ముదిగొండ, ఖమ్మం జిల్లా, నాన్న పేరు. గొల్లపల్లి జనార్ధన్, అమ్మ పేరు.గొల్లపల్లి నాగలక్ష్మి

2. బాల్యం ఎలా గడిచింది..

 మాది నిరుపేద కుటుంబం మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళం, మా అమ్మ నాన్న రోజువారి కూలీలు, పేదరికంలో బాల్యం గడిచిపోయింది.

3. విద్యాభ్యాసం, ఎక్కడ,ఎంతవరకు చదివారు.

 ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మా ఊరి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదివాను. 2011లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 2015 లో డిగ్రీ పూర్తి చేశాను.

4. వివాహం ఎప్పుడు జరిగింది...

 ఇంటర్మీడియట్ పూర్తి అయ్యాక, కట్నం ఇవ్వలేని స్థితిలో 2011లో బాల్య వివాహం చేశారు. 2012లో పాప శాలిని జన్మించింది.

5. జాబ్ ఎలా సాధించారు. ఎలా ప్రిపేర్ అయ్యారు.

 2017లో డిగ్రీ పూర్తి అయ్యాక, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ మేడమ్ అనిత సలహాతో హైదరాబాదులోని కోచింగ్ సెంటర్ లో మూడు నెలలు కోచింగ్ తీసుకుని, మొదటిసారి 2016 నోటిఫికేషన్ లో ప్రయత్నించగా,విఫలమయ్యాను. తరువాత 2018 రెండవసారి ఎస్సై ఉద్యోగం సాధించాను.పట్టుదల, ఏకాగ్రత సబ్జెక్టు వైస్ గా ప్రిపేరయ్యాను.

6. తొలి పోస్టింగ్ ఎక్కడ...

 ఎస్సైగా ట్రైనింగ్ బూర్గంపాడు తరువాత చండ్రుగొండ

7. మీకు బాధ కలిగించిన విషయం ఏమైనా ఉందా...

 మా కుటుంబంలోనే మా తల్లిదండ్రులు విద్యపై అవగాహన లేక పదవ తరగతి కూడా చదివించలేని పరిస్థితిలో ఉన్న, పెళ్లి తర్వాత చదువుకోవడానికి ప్రయత్నించగా భర్త, అత్తమామలు అంగీకరించలేదు. వారితో విభేదించి పుట్టింటికి వచ్చి మళ్లీ చదువుపై దృష్టి సారించాను. కానీ చుట్టుపక్కల వారు ఎగతాళి చేయడం


8. సంతోషంగా అనిపించిన రోజు...

 ఉద్యోగం సాధించిన రోజు మా అమ్మ చెప్పి వాళ్ళల్లో ఆనందం చూసిన రోజు


9. జాబ్ ని ఎలా ఆస్వాదిస్తున్నారు...

 నా సంకల్పంతోనే ఉద్యోగం సాధించాను. ఈ ఉద్యోగంలో నాకు చాలా సంతృప్తినిస్తుంది. గర్వంగా ఉంది.

10. పేకాట,జూదం, గుడుంబా నియంత్రణలో ఉందా..

 మండల మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలపై జూజం, పేకాట, గుడుంబానియంత్రణ ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది.

12. నేటి మహిళలకు మీరు ఇచ్చే సూచన..

 ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్న మహిళలకు పట్టుదల, సంకల్పం, ధైర్యం ఉండాలి. మనం దేనినైనా సాధించగలుగుతాం  అని మనకు మనోధైర్యంతో పాటు మహిళల కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి రంగాలలో, మనకు నచ్చిన రంగాలలో ముందుండాలని, మహిళా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని రుజువు చేయాలన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: