CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం కేసీఆర్ రాక

Share it:


  •  త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీఎం కేసీఆర్ రాక 
  • కలెక్టరేట్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవం ....  ప్రభుత్వ విప్  రేగా కాంతారావు

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 19 .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని జిల్లా కేంద్రాల్లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కలెక్టరేట్ , టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు స్పష్టం చేశారు శనివారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన చరిత్రలో నిలిచిపోతున్నదని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందన్నారు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అని అభివర్ణించారు, రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పాలనలో పనిచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకొని మళ్లీ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు, ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల వరమని ఇక్కడి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేసిన కృషి మరువలేనిదని అన్నారు, సీఎం కేసీఆర్ కి జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు, ఎంతోకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న రైతులకు సీఎం కేసీఆర్  స్వయంగా హక్కు పత్రాలు అందిస్తారని తెలిపారు, దేశంలోనే అత్యంత బలమైన పార్టీ బీ ఆర్ఎస్ పార్టీ అన్నారు, రాష్ట్ర ప్రజలు పార్టీని గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు అధికారం కట్టబెట్టారని చెప్పారు, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలను నిర్మించిందన్నారు, కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కేంద్రానికి వచ్చిన వారికి కార్యాలయం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా  పిఏలు చందా హరికృష్ణ, మహేశ్వరం సాయినాథ్, కర్నె మురళి, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు అన్వర్, పినపాక నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, యూత్ నాయకులు సుగ్యాల శ్రీకాంత్, ఎండి ఆదం, గుమ్మడి వెళ్లి సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: