CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన జాతీయ నాణ్యత విభాగం అధికారులు..

Share it:

 


మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన జాతీయ నాణ్యత విభాగం అధికారులు..

- రెండు రోజులు పాటు ఆస్పత్రిలోనే బృందం సభ్యులు...


 మన్యం న్యూస్,  చండ్రుగొండ, నవంబర్ 4 :

ఆరోగ్య జాతీయ నాణ్యత విభాగం అధికారులు శుక్రవారం చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ముందుగా ఆస్పత్రిలో ఉన్న వైద్య సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఆస్పత్రికి వచ్చే రోగులను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు. వారికి ట్రీట్మెంట్ ఎలా నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి వ్యాధి గ్రస్తులు ఆస్పత్రికి వస్తుంటారు. వారికి కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎంత మంది పనిచేస్తున్నారు.వారి వివరాలను కూడా సేకరించారు. అలాగే గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఎప్పుడు నిర్వహిస్తున్నారు. వాటి ద్వారా ప్రజలకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది. ఆనే విషయాలు కూడా అధికారులు క్లుప్తంగా రికార్డ్ లో నమోదు చేసుకున్నారు. శనివారం కూడా ఆసుపత్రిలోనే ఉండి, రికార్డులను, ఫార్మాసి, ల్యాబ్ లోని పరికరాలను, జనరల్ వార్డు సేవలను, ఓపి సేవలను, ఆస్పత్రిలో శానిటేషన్, కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.ఈ కార్యక్రమంలో నాణ్యత విభాగం అధికారులు డాక్టర్ గురు ప్రశాంత్ (పాండిచ్చేరి),డాక్టర్ భాగ్యవతి (కర్ణాటక), జిల్లా వైద్యశాఖ అధికారి (డిఎంహెచ్ఓ) దయానంద్, జిల్లా మానిటరింగ్ అధికారి డాక్టర్ గడ్డం చేతన్, మండల వైద్యాధికారి వెంకట ప్రకాష్, హోమియోపతి వైద్యులు ప్రవీణ్ కుమార్, ఆస్పత్రి సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: