CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజావాణి లో ప్రతి దరఖాస్తుకు జవాబు దారిగా ఉండాలి.... జిల్లా కలెక్టర్ అనుదీప్

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిది నవంబర్ 7...ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి అందజేసిన దరఖాస్తులు పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అందుకు ప్రతి ఒక్కరు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.  సోమవారం కలెక్టరేట్ సమావేశంలో  అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల  సమస్యల దరఖాస్తులు స్వీకరించి తక్షణమే పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన భానోతు అరుణ  తిప్పనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన రెండు పడకల  ఇల్లు మంజూరుకు  దరఖాస్తు చేశానని,  తనకు, తన  కుటుంబ సభ్యుల పేరున ఎటువంటి ఇల్లు,  ఇంటిస్థలం లేవని లబ్ధిదారుల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందని తన కుటుంబ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ నిర్వహించి తనకు రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యల కొరకు డీఆర్ఓ కు ఎండార్స్ చేశారు.

  కొత్తగూడెం మండలం గాజులరాజం బస్తి పరిధికి చెందిన ఎస్ సర్వేశ్ కుమార్ మరికొందరు  విశ్వనాథ కాలనీకి చెందిన కాలనీ వాసులు మురుగు కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని,  మురుగునీరు బయటకు పోయే మార్గాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, 

మురుగు కాలువలు ఏర్పాటు చేయవలసిందిగా చేసిన దరకాస్తును పరిశీలించిన కలెక్టర్ తక్షణం పనులు ప్రారంభించాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

 మణుగూరు మండలం యుపిఎస్ చిక్కుడుగుంటలో ఎస్జీటీగా పనిచేస్తున్న బోడ విజయకుమారి 

నడుంనొప్పి ,గర్భసంచి సమస్యలతో బాధపడుతున్నానని, దూర ప్రయాణం చేయలేకపోతున్నానని వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రకారం కొత్తగూడెం లేదా టేకులపల్లి మండలాలలో డిప్యూటేషన్ పై కేటాయించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డి ఈ ఓ కు ఎండార్స్ చేశారు.

 . ఇల్లందు మండలం, పాత పూసపల్లి గ్రామం, తిలక్ నగర్ గ్రామ పంచాయతికి చెందిన కుంజా  వీరస్వామి 

 పూసపల్లి గ్రామ శివారు నందు పోడు వ్యవసాయం కలదని ఇట్టి పోడు వ్యవసాయం గత 25 సంవత్సరాలు నుండి సాగు చేస్తున్నానని 2006-2007 సంవత్సరంలో సర్వే చేసినప్పుడు కొంత భూమికి  అటవి అనుమతుల పట్టా పొందినానని,  మిగిలిన పోడు భూమికి సర్వే చేయడానికి  వచ్చిన వారిని మా గ్రామానికి చెందిన వారు అడ్డుకుంటున్నారని,  ఇట్టి విషయంలో గ్రామస్థాయిలో విచారణ జరిపించి అటవీ హక్కుల చట్ట ప్రకారం న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు ఎఫ్ఆర్ఓ కు ఎండార్స్మెంట్ చేశారు.

చుంచుపల్లి మండలం, త్రీ ఇంక్లైన్   గ్రామపంచాయతీ సర్పంచ్ ఆంగోతు మోతి గ్రామపంచాయతీ పరిధిలోని త్రీ ఇంక్లైన్,  వెంగళరావు కాలనీ,  బేరియం తండ మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కలవని ప్రహరి  లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రహరి  నిర్మాణం చేయించాలని  చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ అధికారికి ఎండార్స్మెంట్ చేశారు.

 ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share it:

SLIDER

TELANGANA

Post A Comment: