CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యతో పాటు క్రీడా రంగం లోను ముందుండాలి...

Share it:

 


విద్యతో పాటు క్రీడా రంగం లోను ముందుండాలి...

-విద్యార్థులు ముందే ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి.

-బాల సంస్కృతులు మరుపు రానివి.

అభివృద్ధిలో అగ్రగామిగా పినపాక నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా.

-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

మన్యంన్యూస్, మణుగూరు: విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగం లోను ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు  సీ టైపులోని ఎక్స్ లెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్ నందు నిర్వహించిన  స్పోర్ట్స్ అండ్  కల్చర్ మీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులు ముందే ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు. బాల సంస్కృతులు మరుపు రానివని బాలలందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక  కార్యక్రమాలు, సామాజిక సేవా  కార్యక్రమాలు తదితర అంశాల్లో కూడా  రాణించాలన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటేనే విద్యలో రాణించడం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టపడి ఒక లక్ష్యంతో చదువుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నత విద్యా  ప్రమాణాలు అందిస్తూ మారుమూల ప్రాంతంలో అత్యుత్తమ విద్యార్థులను తయారు చేస్తున్న ఎక్సలెంట్ విద్యాసంస్థల సేవలు అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు  బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, సీఐ ముత్యం రమేష్, ఎస్సైలు రాజ్ కుమార్, పురుషోత్తం, విద్యా సంస్థల యజమానులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  తదితరులు పాల్గొన్నారు.  

 

-అభివృద్ధిలో అగ్రగామిగా పినపాక నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా...


ప్రజల సౌకర్యంకోసం  కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి నిరంతరం  అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్నానన్నారు.  అభివృద్ధి సంక్షేమ పనులతో పినపాక నియోజకవర్గాన్ని అగ్ర భాగంలో నిలపడమే తన లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల తోడ్పాటుతో  అత్యధిక నిధులతో ప్రజలకు సాగునీరు, డ్రైనేజీ, సౌకర్యవంతమైన రహదారులు, కమ్యూనిటీ హాలు సహా ఇతర మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. నియోజవర్గ సమగ్ర అభివృద్దే ద్యేయంగా   ముందుకు సాగుతున్నానన్నారు. అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని  ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నానన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: