CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలల హక్కులు రక్షించాలి.

Share it:


మన్యం న్యూస్ , నవంబర్ 19 ,వాజేడు.:

ములుగు జిల్లా  వాజేడు మండలం లోని పేరూరు ఆశ్రమ పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు జోగయ్య అధ్యక్షతన జరిగిన అవగాహన ర్యాలీ కార్యక్రమానికి చైల్డ్ లైన్ కోర్డినేటర్ భూపాల  విక్రమ్  ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ బాలలు శారీరక ఎదుగుదలను అర్ధం చేసుకొని, బావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలని, జీవితం లో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి జీవన నైపుణ్యాలు అలవర్చు కోవాలని,  బాలలు తమ హక్కులకు భంగం వాటిళ్ళితే 1098 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని,కోరారు. వివాహ వయసు రాకముందే బాల్య వివాహం చేసినట్లయితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బాలల హక్కుల గురించి బాలలందరు తెలుసుకోవాలని,బాలల హక్కులు ముఖ్యంగా.జీవించే హక్కు.అభివృద్ధి చెందే హక్కు, బాగా స్వామ్యం హక్కు,రక్షణ పొందే హక్కులని తెలిపారు. అదేవిధంగా బాలల హక్కులపై ఉల్లంఘనను గుర్తించాలని, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు  చైల్డ్ హెల్ప్ లైన్ 1098  సేవలను పొందాలని సూచించారు.  బాలికలంతా  తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి పోటీతత్వం తో జీవితం లో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఎదగాలని అన్నారు. పిల్లల పై లైంగిక నేరాలు, బాల్య వివాహాలు వంటి సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. సమాజం లో బాల బాలికలపై లైంగిక దాడులు అధికమవడం చాలా బాధాకరమని, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా వారిని ఈ కార్యక్రమం ద్వారా  అవగాహనపర్చి  తమను తాము కాపాడుకొనేలా, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే చట్టపరమైన రక్షణ పొందేలా జిల్లాలోని బాలల బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ఈ  కార్యక్రమం లో ఉపాధ్యాయలు, విద్యార్థులు, స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు చైల్డ్  టీమ్ మెంబెర్ జయసుధ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: