CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మునుగోడులో ఫ‌లించిన టీఆర్ఎస్, కామ్రేడ్ల పొత్తు

Share it:


  •  మాకు స‌గం
  • కామ్రేడ్ల ఖ‌ర్చీఫ్
  • కొత్త‌గూడెం, వైరాపై సీపీఐ
  • పాలేరు, భ‌ద్రాచ‌లం, మ‌ధిర‌పై సీపీఎం
  • పాలేరులో ఎర్ర‌జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌న్న త‌మ్మినేని
  • ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ సీట్ల‌పై రెండుపార్టీల న‌జ‌ర్
  • మునుగోడోత్సాహం

మ‌న్యంన్యూస్, ప్ర‌త్యేక ప్ర‌తినిధి:

 మునుగోడులో ఫ‌లించిన టీఆర్ఎస్, కామ్రేడ్ల పొత్తు ఇక ముందు కూడా కొన‌సాగ‌నుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నారు. మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కామ్రేడ్ల కార్యాచ‌ర‌ణ ఇక ముందు ముందు జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాల‌కు అద్దం ప‌డుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మ‌డి ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ సీట్ల‌పై క‌న్నేశాయి. ఒక్కో పార్టీ మూడు నుండి ఆరుసీట్లు డిమాండ్ చేస్తుండ‌గా, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో గ‌త ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుని నాలుగు నుండి ఐదు స్థానాలు వామ‌ప‌క్షాలకు కేటాయించ‌వ‌చ్చ‌న్న అంచ‌నాలో వామ‌ప‌క్షాల నేత‌లున్నారు. రెండు పార్టీల రాష్ట్ర కార్య‌ద‌ర్శులు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారే కావ‌డంతో ఈ ఇద్ద‌రికి సీట్లు కేటాయించ‌డం ఖాయ‌మ‌ని, పొత్తు పొడ‌వ‌డానికి అదే కీల‌కం కాబోతుంద‌ని పొలిటిక‌ట్ స‌ర్కిల్స్ లో విన‌బ‌డుతోంది. అయితే భ‌ద్రాచ‌లం, మ‌ధిర మిన‌హా మిగ‌తా స్థానాల్లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండ‌డంతో పొత్తు రాజ‌కీయంపై ఆస‌క్తి నెల‌కొంది. పాలేరులో ఎర్ర‌జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం ఆదివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌రీంన‌గ‌ర్ లో హుస్నాబాద్ స్థానం కూడా సీపీఐ కోరుతోంది. గులాబీ వామ‌ప‌క్ష రాజ‌కీయాలు భ‌విష్య‌త్తులో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో స‌రికొత్త రాజ‌కీయ‌మార్పుల‌కు కేంద్ర‌బిందువు కాబోతున్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: