CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళేది పాత్రికేయులు

Share it:


  •  ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళేది పాత్రికేయులు
  • జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు కై కృషి చేస్తున్న
  • ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న... ఎమ్మెల్యే రేగా
  • హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి నవంబర్ 19.... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి వర్గాలకు తెలియజేసేందుకు పాత్రికేయలే అత్యంత కీలకమని రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఇదే తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చి నేడు ఆ హామీని నిలబెట్టుకున్నానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు స్పష్టం చేశారు. శనివారం కొత్తగూడెంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన స్పష్టం చేశారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి తాను కట్టుబడి పని చేస్తున్నానని ఏళ్ల తరబడి  జర్నలిజం వృత్తిలో పనిచేస్తూ అనేక కష్టాలను ఎదుర్కొంటున్న పాత్రికేయులకు తాను ఎమ్మెల్యేగా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కృషి చేస్తున్నాను అన్నారు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గం లో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి ప్రత్యేక సర్వే చేసి ఇవ్వాలని సంబంధిత రెవెన్యూ అధికారులను  కూడా కోరామన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గరనుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం గత మూడేళ్ల నుంచి అనేక రకాలుగా ప్రయత్నం చేసి ప్రధాన సమస్యల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలుమార్లు చర్చించామని ఎట్టకేలకు అధినేత ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైన జీవోను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే జర్నలిస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా స్థలాలు మంజూరు చేయడంలో ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్ట్ యూనియన్ లో బాధ్యులు కల్లోజు శ్రీనివాసరావు, ఇమంది ఉదయ్ కుమారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి అనేకమంది ప్రజాప్రతినిదులకు జర్నలిస్టుల సమస్యలపై విన్నవించుకుంటే కాలయాపన చేశారే తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించలేదని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా నియమింపబడ్డ ఎమ్మెల్యే రేగా స్పందించడమే కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పాత్రికేయులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: