CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇసుక క్వారీలతో ఆదివాసీలకు ఆర్థిక అభివృద్ధి సాధికారిత.

Share it:


మన్యం న్యూస్,  వాజేడు, నవంబర్ 12 :
మండల లోని భువనపల్లి, ధర్మవరం గ్రామాల్లో ఇసుక సంఘాల పాలకవర్గము సమావేశమైంది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు పీర్ల సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇసుక క్వారీల ద్వారా ఏజెన్సీ ఆదివాసులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా మేలు చేయు ఉద్దేశంతో  గిరిజనుల ద్వారా సంఘాలను ఏర్పాటు చేసి వాటికి నిబంధనల ప్రకారం  అనుమతులు తెచ్చి వాటి ద్వారా క్వారీల నిర్వహణ జరుగుతున్నది అని అన్నారు. అదే క్రమంలో ములుగు జిల్లా వాజేడు మండలంలో నడుస్తున్న క్వారీలతోపాటు ధర్మవరం, అయ్యవారిపేట, కోరకల్లు, మూడు క్వారీలు కూడా అనుమతులు పొంది నడుస్తున్నాయి 2022 మార్చి నుండి నడుస్తున్న క్రమంలో ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొంతమంది గిరిజనేతరులు గిరిజన సంఘాల పైన ఫిర్యాదులు చేస్తూ అధికారులను కలిసి ఉన్నారు. మార్చి నెల నుండి ప్రస్తుతం ఇప్పటివరకు అదే పనిగా ఫిర్యాదులు చేస్తూ అవకాశాల గురించి చూస్తున్నారు. ఇప్పుడు మిర్చి పంటపై దుమ్ము పడుతుందని ఫిర్యాదులు చేశారు అని ఆయన అన్నారు మరి మార్చి నుండి జూన్ వరకు పంటలు లేకపోయినా సదరు వ్యక్తి ఎందుకు గిరిజన సంఘాల పైన ఫిర్యాదు చేశారు. కాబట్టి అతను గిరిజన సంఘాల అన్న గిరిజన అభివృద్ధి అన్న అతనికి నచ్చదు మేము క్వారీ నిర్వహణ సమయంలో రోడ్డుపై ట్యాంకర్లతో తడుపుతున్నము అదేవిధంగా ఎటువంటి దమ్ము విరజిమ్మకుండా చూస్తున్నాము అయినా ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయి దీని ఒక రాజకీయ పార్టీ  గిరిజనుల అభివృద్ధి  అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది కావున మేము కోరుకునేది ఏమిటంటే క్వారీ నిర్వహణ నవంబర్ 2022 వరకు ఆన్లైన్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం నిర్వహణ సమయంలో రోడ్డు తడిపి దుమ్ము రాకుండా చూస్తామని అన్ని బాధ్యతలు మాయేనని సంబందిత అధికారులని కోరుతున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో లొడిగ నర్సింహారావు, టింగ సాయి తేజ, వి ముత్తయ్య పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: