CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ.

Share it:


తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఇక జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దసరా రోజు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌..    దానిని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బీఆర్‌ఎస్‌పై అభ్యంతరాలు తెలుపాలని నోటిఫికేషన్‌ ఇచ్చారు. నెల రోజుల్లో.. ఎలాంటి అభ్యంతరాలు కాకపోతే… బీఆర్‌ఎస్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేలా ప్రచారం చేయాలని గులాబీ బాస్‌ ఉన్నారు. 

ఈమేరకు ఢిల్లీ వెళ్లి.. అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తున్నారు. భారీ బహిరంగ సభకు కూడా ఆయన ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచాం.        ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలనే..  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 12న తెలంగాణలో పర్యటించనున్నారు. రామగుండం ఎరువుల పరిశ్రమను జాతికి అంకింతం చేయనున్నారు. ఐతే ప్రధాని పర్యటనకు ఒకరోజు ముందు అంటే.. శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్తారని సమాచారం. ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు దూరంగా ఉండేందుకే కేసీఆర్‌ హస్తినకు వెళ్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 రామగుండం కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. కానీ టీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ వైరం తారా స్థాయికి చేరడంతో.. మోదీ పర్యటనకు తెలంగాణ సీఎం హాజరుకావడం లేదు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.    రెండు కారణాలతో హస్తిన బాట..  సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన వెనక రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. ఒకటి.. ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండడం. రెండు.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ. మొన్నటి వరకు మునుగోడు ఉపఎన్నిక, ఎమ్మెల్యేల కోనుగోళ్ల వ్యవహారంపై దృష్టిసారించిన కేసీఆర్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ పెట్టనున్నట్లు సమాచారం. 

ఇటీవలే టీఆర్‌ఎస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారు. ఢిల్లీ వేదికగానే ఈ సభను నిర్వహించాలని భావిస్తున్నారట. డిసెంబర్‌ 9 లేదా 13న ఢిల్లీలో రైతులతో భారీ ఎత్తున సభను పెట్టే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్‌కి మద్దతు కోసం పలు పార్టీ నేతలను కలిసేందుకు.. సీఎం కేసీఆర్‌ హస్తినకు వెళ్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    సీఎం వెంట మంత్రులు..  సీఎం కేసీఆర్‌ వెంట పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తారని సమాచారం. 

నాలుగు రోజులు అక్కడే ఉండి.. వివిధ పార్టీల నేతలను కలుస్తారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతోపాటు ఢిల్లీ సభకు హాజరు కావాల్సిందితా వారిని కోరుతారని సమాచారం. అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని కూడా జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లి.. బీజేపీని టార్గెట్‌ చేయాలనే వ్యూహంలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని సమాచారం. బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని .. విపక్ష పార్టీలన్నీ ఒక్కటై.. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని.. విపక్ష పార్టీలకు వివరించబోతున్నారని తెలుస్తోంది.         లిక్కర్‌ స్కాం పురగతిపైనా చిర్చంచే అవకాశం..  మరోవైపు ఢిల్లీ లిక్కస్కాంలో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. మరోఇద్దరు తెలుగువారిని గురువారం అరెస్ట్‌ చేసింది. 

ఈ నేపథ్యంలో తర్వాతి అరెస్ట్‌ ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ స్కాంలో కేసీఆర్‌ కూతురు కవిత ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమెను విచారణ చేసి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్కాం నుంచి ఎలా బయటపడాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాతోనూ మంతనాలు జరుపుతారని తెలుస్తోంది.    రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు..  ఢిల్లీ పర్యట పూర్తయిన తర్వాత కేసీఆర్‌ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ రావాలని భావిస్తున్నట్లు తెలిసింది. తిరుగు ప్రయాణంలో తమకు మద్దతిచ్చే పార్టీలతో కలిసి సీఎం కేసీఆరర్‌ రోడ్‌షోలు నిర్వహిస్తారని సమాచారం. స్థానిక నేతలతో సమావేశాలు కూడా సమావేశాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్న అంశంపైనా వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Share it:

TELANGANA

Post A Comment: