CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలివ్వాలి

Share it:


*ప్రభుత్వము పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టిన  భూములను సర్వే నిర్వహించి పట్టాలి వ్వాలి.

*ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా పోడు భూములలో మొక్కలు నాటుతున్నారు. 

*మొక్కలు నాటిన  భూమిని సర్వే నిర్వహించి కేసులో ఉన్న పోడు రైతులకు అందించాలి. 

*ఎఫ్ ఆర్ సి కమిటీ అధ్యక్షుడు చిటమట రఘు. 

మన్యం న్యూస్, ఏటూరు నాగారం:

ఏటూరునాగారం,మానసపల్లి  శివారు ప్రాంతాలలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పోడు భూమిని సాగు చేసుకోగా ఫారెస్ట్ అధికారులు ఈ భూమిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం జరిగిందనీ,ఆ భూమిలో సాగు చేసుకుంటు జొన్నలు,జీలుగు,నువ్వులు, వరి  పండించడం జరుగుతుందని అన్నారు.ఈ భూమిలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో మొక్కలను 2022 జూన్,జూలై మాసంలో సాగులో ఉన్న భూములు ఫారెస్ట్ అధికారులు మొక్కలు పెట్టడం జరిగిందనీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోడు భూములు సర్వే నిర్వహించి పోడు రైతులకు పట్టాలు ఇస్తానని చెప్పి మరి గత సంవత్సరంలో పోడు భూములకు కేసులు పెట్టిన భూములకు పోడు దరఖాస్తులు చేసుకోగా ఆర్ ఓ ఎఫ్ ఆర్ నెంబర్ వచ్చి సర్వే చేయమని లిస్టులో పేరు వచ్చిన మరి ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని సర్వే చేయడం లేదని,

గ్రామపంచాయతీకారులు, రెవెన్యూ అధికారులతో కలసి నో పొజిషన్ ఇన్ లాండ్, కల్టివేషన్  పై అధికారులకు కలెక్టర్ కు పంపించడం సరైనది కాదని ఎఫ్ ఆర్ సి కమిటీ తెలపకుండా,ఒక్కసారి కూడా  ఎఫ్ ఆర్ సి కమిటీతో మీటింగ్ పెట్టకుండా,ఎఫ్ ఆర్ సి కమిటీతో చర్చించకుండా ఇక్కడున్న గ్రామపంచాయతీ అధికారులు,ఫారెస్ట్ అధికారులు,రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ఇది పోడు రైతుల హక్కులకు భంగం కలిగించడమేనని మరి చట్టాలను వాళ్ళ చేతిలో తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.ఇప్పటికైనా పోడు రైతులకు న్యాయం చేయాలని, కలెక్టర్ ను,ఫారెస్ట్ అధికారులను,ఎమ్మార్వో ను, ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వావిలాల స్వామి,తిప్పనపల్లి సుదర్శన్,పోరెడ్డి ప్రమీల,ఎద్దు సత్యం తోగరి సంతోష్,నామిని శంకర్,వలస వెంకన్న,పోడు రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: