CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి చట్టాలను కాపాడుకుందాం : తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్.

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం:

ఏజెన్సీలో ఆదివాసి చట్టాలను కాపాడుకోవాలని,తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అన్నారు.ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకున్న సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్,విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు దబ్బగట్ల సుమన్ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులకు సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు.ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు హక్కులు ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 68 ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఆదివాసి యువతీ యువకులకు 100% ఉద్యోగాలు కల్పించాలన్నారు. కానీ ఎలాంటి రిక్రూమెంట్ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో గిరిజనేతర్లను ఎలా సర్దుబాటు చేస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అర్హులైన ఆదివాసి యువతి యువకులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అన్నారు. గిరిజనేతరులను మైదాన ప్రాంతాలకు పంపించాలని అన్నారు.ఆదివాసి మహిళా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సభాబు కాదని అన్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ మహిళలు చేసే రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షురాలు పాయం భారతి, ప్రధాన కార్యదర్శి యాలం రామలక్ష్మి,ఉపాధ్యక్షురాలు సోలం అరుణకుమారి,బండ రమాదేవి,మడి స్వప్న,కొప్పుల సరిత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: