CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మూగ జీవాల గోస పట్టేదేవరికి

Share it:

 


మూగ జీవాల గోస పట్టేదేవరికి

*రవాణాలో నిరుగారుతున్న చట్టాలు

*పట్టించుకోని అధికారులు

మన్యం న్యూస్, కరకగూడెం: మూగ జీవాల గోస పట్టేదేవరికి?కరకగూడెం మండల వ్యాప్తంగా మూగ జీవాలను అక్రమంగా కొంత మంది దళారులు కర్కశంగా వ్యవహరిస్తూ వరంగల్, హైదరాబాద్ తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధిలో ని కరకగూడెం,ఆనంతారం, రేగుళ్ళ, ఇతర ప్రాంతాల నుండి మూగ జీవాలను విక్రయించి వాటిని ర్యాలీలలో అతి దారుణంగా ఎక్కించి  మూగ జీవాలను  అక్రమ ర‌వాణా చేస్తు,కబేలాలకు తరలిస్తున్నారు.ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలువినపడుతున్నాయి.  హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న అధికారులు పట్టించకుండా వ్యవహరిస్తారు. అక్క‌డ‌క్క‌డ ఈ అక్ర‌మ దందా కొన‌సాగుతూనే ఉంది.ఎక్కవ ఏజెన్సీ ప్రాంతాల అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించి ఆవులు,పశువులను అక్ర‌మ ర‌వాణా కొన‌సాగుతూనే ఉంది.కుటుంబంలో ఆర్థిక,ఆరోగ్య పరిస్థితులను గ్రహించి డబ్బు ఆశ చూపించి పశువులను,ఆవులను 

ఇలా కొంద‌రు అక్ర‌మార్కులు ఎలాంటి భ‌యం లేకుండా సాయంత్రం,రాత్రి వేళలా తెడా లెకుండా య‌ధేచ్ఛంగా ర‌వాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ఇలాంటి ఘ‌ట‌న‌లు జిల్లా సరిహద్దుల గ్రామాలలో చోటు చేసుకుంటున్నాయి.గోవులను  రవాణా చేస్తున్న వాహనాలకు సంబంధించి నెంబర్స్ కూడా లేకపోవడం విచిత్రంగా ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు.

మండలస్థాయి కమిటీ

మండలస్థాయి కమిటీలో తహసీల్దార్‌ చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా సీఐ, మండల పశుసంవర్ధక శాఖ అధికారి ఎంపీడీఓ, కార్యదర్శిగా ఎఫ్‌ఆర్‌ఓ, ఎంవీఐ, ఈఓపీఆర్‌డీ, ఎంఈఓ, మండల వ్యవసాయ అధికారి, జంతు ప్రేమికులు ఇద్దరు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గోశాల నిర్వహణ కమిటీ సభ్యులు సభ్యులుగా కొనసాగుతారు.

జంతు సంరక్షణ చట్టం 1960

కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. దేశవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం రాష్ట్రస్థాయి నుండి మండలస్థాయి వరకు కమిటీలను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీల ద్వారా తీర్మానం ఉంటేనే పశువుల విక్రయాలు తరలింపు జరగాలి. కరువు పేరిట పశువులను విక్రయించరాదంటూ చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఏదైన పశువును మండలస్థాయి తీర్మానం లేకుండా వధించినా, విక్రయించినా రెండేండ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చంటూ చట్టంలో ఉంది. ఈ చట్టం జిల్లాలో ఎక్కడ అమలుకావడం లేదు. చట్టంపై చాలామందికి అవగాహన లేదు. పశువు రోడ్డు ప్రమాదంలో మరణించినా, గాయపరిచినా వ్యక్తిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలంటూ ఈ చట్టంలో ఉంది. కాని ఇది కాగితానికే పరిమితమైంది.

గో సంరక్షణ చట్టం 1977

ఈ చట్టం ద్వారా పాలు ఇచ్చే గోవులను కబేళాలకు తరలించడం నిషేధం. మండలస్థాయిలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ వీటిని అరికట్టాలి. గోవును కబేళాలకు తరలించాలంటే మండలస్థాయిలో తీర్మానించాలి. లేనివాటిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

పశురవాణా చట్టం 1978

పశురవాణా చట్టం ద్వారా ఇష్టం వచ్చినట్లు పశువులను తరలించరాదు. పశువులను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే మండలస్థాయి తీర్మానంతో ఒక్క వాహనంలో రెండు పశువుల కంటే ఎక్కువ రవాణా చేయరాదు. వాహనంలో గాలి, వెలుతురు వచ్చేలా సదుపాయం ఉండాలి. పశువులకు నీరు, ఆహారం కల్పించాలి. ప్రతి అరగంటకు ఒకసారి పశువులను వాహనం నుండి దింపి సేద తీరేలా చర్యలు తీసుకోవాలి. గర్భం ఉన్న పశువులను ఎట్టి పరిస్థితుల్లో తరలించరాదు. తీర్మానం లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా తరలించే వాహనాలను సీజ్‌ చేసి వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

Share it:

TELANGANA

Post A Comment: