CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు కోర్ట్ అవరణలో ఆదివాసీ లాయర్ పై దాడి ఘటన ఖండించిన : ఆదివాసి అడ్వకెట్స్ అసోసియేషన్

Share it:

 

ఇల్లందు కోర్ట్ అవరణలో  ఆదివాసీ  లాయర్ పై దాడి ఘటన ఖండించిన : ఆదివాసి అడ్వకెట్స్ అసోసియేషన్ : ఆదివాసి అడ్వకెట్స్ అసోసియేషన్(AAA)తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోడే వెంకటేష్

    మన్యం న్యూస్,ఇల్లందు:

 ఇల్లందు పట్టణంలోని సివిల్ కోర్టు ఆవరణలో బుధవారం ఆదివాసీ  లాయర్ సువర్నపాక సత్యనారాయణపై దాడి ఘటనను  ఆదివాసి అడ్వకెట్స్ అసోసియేషన్(AAA)-తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్ట్ న్యాయవాది సొడే వెంకటేష్ ఖండించారు.  ఇల్లందు పట్టణంలోని కరంటాఫీస్ ఏరియాకు చెందిన లింగాల వెంకటేశ్వర్లు అతడి కుమారుడు ఇద్దరు కలిసి  లాయర్ సత్యనారాయణపై దాడి చెయ్యడం హేయమైన చర్య అన్నారు. కోర్టు అవరణంలోనే జరిగిన ఈ ఘటనను దురదృష్టకరమన్నారు. లాయర్లపై దాడులు పునరావృతం కాకుండా అడ్వకెట్స్ ప్రొటెక్షన్ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హై కోర్ట్ న్యాయవాది పెనుబల్లి రమేష్ బాబు,  మరియు న్యాయవాదులు తామ బాలరాజు , సిడం వివేకానంద, దనసరి నర్సింహమూర్తి కే.ఏ కుమార్, రవి కుమార్, కే నరేష్, సాయిబాబు, కారం రమేష్, లాల్ షావ్, స్టాలిన్ తదితరులు ఖండించారు.

Share it:

TELANGANA

Post A Comment: