CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో పత్తి దళారుల దంద

Share it:


మన్యం న్యూస్, భద్రాచలం, నవంబర్ 10 :

మారుమూల గిరిజన గ్రామాల అమాయక రైతుల నే  టార్గెట్గా చేసుకొని దళారీ వ్యవస్థ దండు పోవడానికి సిద్ధమవుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతు ఏడాది అప్పులను తీర్చి ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో కష్టపడి ఆరుగాలం పండించిన పత్తి పంటను తక్కువ ధరకు ఎత్తుకెళ్లేందుకు దండు కడుతున్నారు. అమాయకత్వం ఒకవైపు అవసరాలు మరోవైపును టార్గెట్ చేసుకొని కొంతమంది దళారులు గ్రామీణ ప్రాంతాల్లో పత్తి రైతులను మాయమాటలతో చిత్తు చేస్తూ తక్కువ ధరకు పండించిన పత్తి పంటను తీసుకెళ్లేందుకు చూస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మద్దతు ధర ప్రకటించి పత్తి రైతును ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే దళారు ముందుగానే డబ్బులు చెల్లించి రైతులను ఆశపెట్టి తక్కువ ధరకే పత్తి పంటను తీసుకెళ్తున్నారు ప్రధానంగా ప్రభుత్వం ఏడాది పత్తి కౌంటర్లు సకాలం ఏర్పాటు చేయకపోవడంతో గ్రామాల్లో ఏర్పడ్డ చిల్లర పత్తి కౌంటర్ల వద్ద దళారులు వారి వారి పన్నాగాలను పత్తి రైతులు మీద ప్రయోగించి ప్రభుత్వం మద్దతు ధర కంటే తక్కువగానే కొనుగోలు చేస్తూ పత్తి రైతును చిత్తు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ద్వారా జరిపిన నిఘాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భద్రాచలం చర్ల గుండాల ,అల్లపల్లి, కొత్తగూడెం, జూలూరుపాడు ఇల్లందు తదితర ప్రాంతాలలో పత్తి దళారులు రైతులను తక్కువ ధరతో పత్తి కొనుగోలు చేసి నిలువునా ముంచుతున్నారని తేలింది ప్రభుత్వం కొంటుంది రూ.9500 అయితే ప్రస్తుతానికి దళారులు కొనుగోలు చేసేది 6,500 నుంచికిందికే అని చెప్పుకోవాలి .ఈ విధంగా కొనసాగితే రైతులకు కనీసం పత్తి గింజలు పురుగుమందులు దుక్కి దున్నులకు పత్తి తీసేందుకు సరిపోవని రైతులు వాపోతున్నారు. రైతులు దళారులకు పత్తిని అమ్ముకోవద్దని రైతుల స్వయంగా సిసిఐ ఖమ్మం నెక్కొండ కేసముద్రం లాంటి ప్రాంతాలకు వచ్చి అమ్ముకోవాలని సూచిస్తున్నారు లిఖితపూర్వకంగా సీసీఏ కేంద్రాలకు లేదా సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా రాసిచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు.


Share it:

TELANGANA

Post A Comment: