CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇటీవలి టీ20 వరల్డ్‌ కప్‌లో అట్టర్‌ ఫ్లాప్‌

Share it:


 టీ20 వరల్డ్‌ కప్‌ను ఇంగ్లండ్‌ ఎగరేసుకుపోయింది. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేస్తూ రెండోసారి పొట్టి ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలిచింది.    ఇక, ఇప్పుడు అందరి దృష్టి వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ 2023 మినీవేలంపై పడింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ ద్వారా స్టార్స్‌గా మారిన చాలా మంది ఆటగాళ్లు ఇటీవలి టీ20 వరల్డ్‌ కప్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. పేలవ ఆటతీరు ప్రదర్శించారు. దీంతో ఫ్లాప్‌ క్రికెటర్ల ఐపీఎల్‌ కాంట్రాక్టులపై ఫ్రాంఛైజీలు పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు ఐపీఎల్‌ స్టార్స్‌ను వదులుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

   IPL 2023    - ఓడియన్‌ స్మిత్‌ :విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఓడియన్‌ స్మిత్‌ టీ-20 వరల్డ్‌ కప్‌లో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. ఐపీఎల్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరొందిన స్మిత్, వరల్డ్‌ కప్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులే చేశాడు. 9.44 ఎకానమీ రేట్‌తో కేవలం రెండు వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు పంజాబ్‌ కింగ్స్‌ అతన్ని రిలీవ్‌ చేసే అవకాశం ఉంది.    మాథ్యూ వేడ్‌ : ఆస్ట్రేలియాకు చెందిన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ ఐపీఎల్‌-2022లో బాగా రాణించాడు. గజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడిన ఈ ఆటగాడు 10 మ్యాచ్‌ల్లో 157 పరుగులు చేశాడు.

 దీంతో ఇతన్ని టీ-20 వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేసింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. అయితే ఈ వరల్డ్‌ కప్‌లో వేడ్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్‌ తరఫున 4 నాలుగు మ్యాచ్‌ల్లో 100 స్ట్రైక్‌ రేట్‌తో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మెగా టోర్నీలో అతని బ్యాటింగ్‌ సగటు కేవలం 7.5 మాత్రమే. ఫలితంగా ఇతడు ప్రస్తుత ఫ్రాంచైజీకి దూరమయి వచ్చే ఏడాది ఐపీఎల్‌ కోసం నిర్వహించే మినీ వేలం పూల్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.    ట్రిస్టన్‌ స్టబ్స్‌:దక్షిణాఫ్రికా యువ సంచలనం ట్రిస్టన్‌ స్టబ్స్‌.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడిన స్టబ్స్‌ 10.33 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు ఐపీఎల్‌ -2022లో కూడా ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడినా, ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో వచ్చే సీజన్‌కు ముంబై అతన్ని వదిలించుకునే అవకాశం ఉంది.  

     IPL 2023    పాట్‌ కమిన్స్‌:ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున బంతితోపాటు బ్యాటుతోనూ రాణించాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ-20 వరల్డ్‌ కప్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. వరల్డ్‌ కప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కమిన్స్‌ కేవలం మూడు వికెట్లు తీశాడు. బ్యాట్‌తో కూడా అంతగా రాణించలేదు. కేవలం 21 పరుగులు చేశాడు. అతని ఎకానమీ రేట్‌ ఓవర్‌కు 8 పరుగుల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఐపీఎల్‌ -2023 కోసం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కమిన్స్‌ రిటెయిన్‌ చేసుకోకపోవచ్చు. 

   నికోలస్‌ పూరన్‌: గతంలో టీ-20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన విండీస్‌ జట్టు ఈసారి క్వాలిఫైయింగ్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. అందుకు కారణం ఆ జట్టు కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ తీరు. జట్టు ఎంపికలో సరైన వ్యూహం లేకపోవడం, పర్ఫార్మెన్స్‌ పరంగా కూడా పూరన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 86.21 స్ట్రైక్‌ రేట్‌తో కేవలం 25 పరుగులు చేశాడు. దీంతో పూరన్‌కు మరో కాంట్రాక్ట్‌ ఇచ్చే ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచించవచ్చు.

Share it:

SPORTS

Post A Comment: