CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం మున్సిపాలిటీ 11 వార్డులో... బస్తీ ధావఖాన ఏర్పడి చేయాలి

Share it:



  • కొత్తగూడెం మున్సిపాలిటీ 11 వార్డులో...
  • బస్తీ ధావఖాన ఏర్పడి చేయాలి
  • అంగన్వాడి కేంద్రాలలో న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయండి
  • పలు మున్సిపల్ వార్డుల్లో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నవంబర్ 02... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీ 11 వార్డ్ లో బస్తీ ధావకాలను ఏర్పాటు చేయాలని అంగన్వాడి కేంద్రాల లో న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనిదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం కొత్తగూడెంలోని పలు మున్సిపల్ వార్డులలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని 11, 6 ,12, 35, 24 ,33, 34 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను తనిఖీ చేసి సత్వరంగానే  పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మోడల్ అంగన్వాడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరమ్మతులు చేయించి వాల్ పెయింటింగ్ చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లభి పొందుతున్న గర్భిణీలు బాలింతలకు పూర్తిస్థాయిలో ఆరోగ్యం ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు పౌష్టికాహారాన్ని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్య వంతంగా ఉంటారన్నారు. అంగన్వాడీలో చదువుతున్న చిన్నారుల ఆరోగ్య కార్డును పరిశీలించి వయసు ప్రకారం వారికి సంపూర్ణమైన పౌష్టికాహారమైన ఆహారాన్ని అందించే బాధ్యత అంగన్వాడి సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహింపబడుతున్న తొలిమెట్టు కార్యక్రమంలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత ప్రగతిని సాధించేందుకు ఉపాధ్యాయులు కృత్యాధార బోధనతో వారికి పాఠాలు చెప్పాలని ఆదేశించారు. 35 వార్డులు ఏర్పాటు అవుతున్న సఖి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. సఖి కేంద్ర నిర్మాణ పనులు నత్తనడగా సాగుతున్నాయని సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని  పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నవీన్ ,పి ఆర్ ఈఈ సుధాకర్ సిడిపిఓ లేనీనా, తాహసిల్దార్ రామకృష్ణ, టిపిఓ ప్రభాకర్, ఏఈలు రాము, సాహితీ, కౌన్సిలర్లు శ్రీను, విజయలక్ష్మి, రుక్మాంగాదర్ బండారి, సత్యభామ ,రావి మమత, కాసుల ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: