CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

G.O.M.S.No.68 ప్రతిష్టంగా అమలు చేయాలి

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం:

ఆదివాసి సంక్షేమ పరిషత్

ఆధ్వర్యంలో శనివారం ఏటూరునాగారం మండల కేంద్రంలో ఐటిడిఏ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో నాయకులు మాట్లాడుతూ. అక్రమంగా ఏటూరు నాగారం లోని 50 పడకల వైద్యశాలలో గిరిజనేతరులతో భర్తీ చేసినటువంటి ఉద్యోగాలను తక్షణమే రద్దుచేసి అర్హులైన ఆదివాసీ యువతీ, యువకులను నియమించాలని, ఏటూరునాగారంలో ఆదివాసి సంక్షేమ పరిషత్( ASP),ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్( AVSP)ఆదివాసి మహిళ సంక్షేమ పరిషత్ (AMSP) ఆధ్వర్యంలో 2 వ రెండవ రోజు రిలే నిరాహార దీక్షలను ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్సిక సతీష్ పూలదండ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.5 వ షెడ్యూల్డ్ ప్రాంతంలో G.O.M.S.No.68 వైద్య మరియు ఆరోగ్య శాఖలో 100% ఉద్యోగ నియామకాలు ఆదివాసి యువతీ, యువకులకు కేటాయించాల్సిన ఉద్యోగాలు గిరిజనేతలకు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అక్రమంగా ఏజెన్సీ ఉద్యోగాలు పొందిన గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తొలగించాలి అన్నారు. ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/59,1/70 చట్టం ప్రకారం ది 03-02-1970 తర్వాత మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతాలకు వలసలు నిషేధమని చట్టం చెబుతున్న జిల్లా కలెక్టర్లు ఐటిడిఎ పిఓలు ఈ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోవడంతోనే ఏజెన్సీ ప్రాంతానికి చెందిన  ఆయా పోస్టులలో గిరిజనేతరులతో నియామకాలు చేపడుతున్నారని విమర్శించారు. ఆదివాసులకు దక్కవలసిన ఉద్యోగ ,ఉపాధి రంగాలలో ఉద్యోగాలు దోచుకోవడానికి ఆదివాసులకు నిరాధారమైన జీవోలను కోర్టు ద్వారా కేసులు వేయించడం చేస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి  జీవోలు ద్వారానే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధ్వర్యంలో ఆదివాసి విద్యార్థిసంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు బోదే బోయిన సురేష్, ఆదివాసి మహిళా సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షురాలు కొప్పుల సరిత, బడే సులోచన,  ఏటూరు నాగారం మండల అధ్యక్షురాలు పాయం భారతి, ఉపాధ్యక్షులు సోలం అరుణకుమారి, యాలం రామలక్ష్మి, బడే స్వప్న, దుబ్బ కావ్య, బండ రమాదేవి, ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల నాయకులు తుర్స కృష్ణ బాబు, మడప సతీష్  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: