CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రీన్ భద్రాద్రి వారి సేవలు భద్రాచలం లో చిరస్థాయిగా నిలిచిపోతాయి: ఏ.ఎస్.పి.రోహిత్ రాజ్

Share it:


ఈరోజు గ్రీన్ భద్రాద్రి వారు చేపట్టిన మిద్దెతోటల పెంపకం పై అవాహాన మరియు మిద్దెతోటల పెంపకం దారులకు కూరగాయల విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏ.ఎస్.పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ , గ్రీన్ భద్రాద్రి వారు అవిశ్రాంతంగా 2012 మొక్కలు నాటి, వాటిని సంరక్షణ చేస్తూ భద్రాచలాన్ని పచ్చని భద్రాద్రి గా మార్చటానికి కృషి చేస్తూ మరోక అడుగు ముందుకు వేసి మిద్దెతోటల ఔత్సాహికులకు అవగాహన కల్పించటం , కూరగాయల  విత్తనాలు ఉచిత పంపిణీ చేయటం వంటి కార్యక్రమాలు చేయటం వలన గ్రీన్ భద్రాద్రి సంస్థ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అంతేకాక కుండీలలో మొక్కలు పెంపకం వంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న గ్రీన్ భద్రాద్రి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మిద్దెతోటల  ఔత్సాహికులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చని వారికి మన మిద్దె ఏమాత్రం దెబ్బతినకుండా, కాలవలసిన సాంకేతిక  సలహాలు,  విత్తనాలు అందించగలమని , మనం పండించిన కూరగాయలు మనమే తినటం మానసికంగా, ఆరోగ్య పరంగా చాలా మంచిదని తెలియజేసారు. ఔత్సాహికులు ఎవరైనా ఉంటే ఈక్రింద తెలియజేసిన నంబర్లను సంప్రదించటం ద్వారా మీరు మరింత సమాచారాన్ని పొందవచ్చని తెలియజేసారు.

మోబైల్ నం.9885183550, 9059307455.

 ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు కామిశెట్టి కృష్ణార్జునరావు, ప్రదాన కార్యదర్శి చారుగుళ్ళ వెంకట నాగభూషణం, కోశాధికారి శ్రీరంగం సంపత్, ఫౌండర్ బొలిశెట్టి రంగారావు, ట్రస్ట్ అధ్యక్షులు ఏగి సూర్యనారాయణ, గౌరవాధ్యక్షులు పల్లింటి దేశప్ప , డా.గోళ్ళ భూపతి రావు , భోణాల నాగ సూర్యనారాయణ, బోగాల శ్రీనివాస రెడ్డి,  అబ్రహాం , భీమవరపు వెంకట రెడ్డి, మునికేశవ్ , శ్రీమహాలక్ష్మి, గంగాధర వీరయ్య, ఉమా శంకరనాయుడు, ఉప్పాడ  రాంప్రసాద్ రెడ్డి, తంగేటి కృష్ణ, పి.ఆర్.ఓ. కడాలి నాగరాజు, పూసం రవికుమారి తదితరులు పాల్గొన్నారు.


             కామిశెట్టి కృష్ణార్జునరావు

                        అధ్యక్షులు

               గ్రీన్ భద్రాద్రి భద్రాచలం

Share it:

TELANGANA

Post A Comment: