CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ ఆశయ సాధనకు కలిసి కట్టుగా కృషి చేయాలి. : తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 22...ఆదివాసుల కోసం అహర్నిశలు కృషిచేసి ఒకవైపు బ్రిటిష్ వాళ్ళ పై పోరాటం చేస్తునే, మరోవైపు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి కొమరం భీమ్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిఐటియు నాయకులు భూక్య రమేష్ పిలుపునిచ్చారు. కొమరం భీం జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో కొమరం భీమ్ విగ్రహం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  భూక్యా రమేష్, గిరిజన సంఘం నాయకులు మూతి రామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూనే, ఆదివాసుల హక్కుల కోసం, వెనుకబడిన తరగతుల కోసం బ్రిటిష్ పాలకవర్గాన్ని ప్రశ్నించి పోరాటం చేసినటువంటి వ్యక్తి కొమరం భీమ్ అని అన్నారు. నిజాం నవాబులకు వ్యతిరేకంగా నీ భాంచన్ దొర కాళ్ళు మొక్కుతా అన్న పేదోడితో, ఆదివాసీలతో చైతన్యాన్ని నింపి, జల్ ,జమీన్ జంగల్ మాదేనని గొంతెత్తి నినదించిన వీరుడని అన్నారు. ఆదివాసి జాతి ప్రత్యేక పాలకవర్గం కావాలని ఆదివాసీల అభ్యున్నతి కోసం పోరాడుతూనే పేద ప్రజలకు భూమి కావాలని వారి హక్కులకు రక్షణ కల్పించాలని నైజాములకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించిన చరిత్ర కొమరం భీముదన్నారు. జయంతి సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి  స్థానిక పేదలు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు  వెంకట్ కృష్ణ, దుర్గ ,ప్రేమ్, రామకృష్ణ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: