CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీరంగం సృష్టించిన లారీ డ్రైవర్

Share it:


సారపాక, మన్యం న్యూస్, అక్టోబర్ 28 :

మద్యం మత్తులో సోయ లేకుండా లారీ తోలుతూ ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... శుక్రవారం రాత్రి సమయంలో బూర్గంపాడు మండల పరిధిలోని గొమ్మూరు ప్రాంతంలో ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో సోయి లేకుండా లారీని నడుపుతూ వీరంగం సృష్టించాడు. కొంత దూరం అలాగే లారీ నడుపుతూ వచ్చాడు సదరు లారీ డ్రైవర్. ఈ క్రమంలో గొమ్మూరు కాలనీ బతుకమ్మ గద్దెలకు సమీపంలోని పొలాల్లోకి లారీ దూసుకుపోయింది. లారీని రోడ్డుపై అలాగే అడ్డంగా నిలిపివేసి డ్రైవర్ సోయి సొంపు లేకుండా పడిపోయాడు. విషయం తెలుసుకున్న బూర్గంపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

Share it:

TELANGANA

Post A Comment: