CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:


సారపాక, మన్యం న్యూస్, అక్టోబర్ 28 :

పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలనే సంకల్పంతో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం సారపాక  గ్రామంలోని గాంధీనగర్, పాలకేంద్రం ఏరియా, పుల్లయ్య క్యాంపు ప్రాంతాల్లో పర్యటించారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అనునిత్యం ప్రజల కొరకు కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు ఈ పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి కాలనీలలో పర్యటిస్తూ సమస్యలను ప్రజల ద్వారా గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గురించి జెడ్పిటిసి  ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజీలు, రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలు ప్రజలు జెడ్పిటిసి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ... నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు కోట్లాది రూపాయలు ప్రభుత్వంతో మంజూరు చేయించి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రేగా కాంతారావు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. వారి సహకారంతో అనేక గ్రామాలకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్ని మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించి భవిష్యత్తులో సమస్యలు లేకుండా సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తూ రైతే రాజుగా వర్ధిల్లేందు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని పేర్కొన్నారు. నేడు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది అని ఆమె గుర్తు చేశారు. ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉంటారని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సారపాక టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, పినపాక నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ కొమ్ము లక్ష్మీ చైతన్య రెడ్డి, కార్యదర్శి భూక్య చిరంజీవి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు బెజ్జంకి కనకాచారి, చుక్కపల్లి బాలాజీ, మాజీ ఎంపీటీసీ వెంకటరమణ, చట్టి ఆంజనేయులు, నక్క రమాదేవి, కర్రీ కోటేశ్వరరావు, కర్రీ నాగ, బిట్రా సాయిబాబా, అరుణ్ ప్రసాద్, యువజన నాయకులు భూక్య కృష్ణ, ములకలపల్లి ప్రసాద్, రాయల నరేంద్ర, జీనుగు దాసు, గొడ్ల రాజు, ఏసుపాక ఈశ్వర, సోను, చెలికాని శివరామకృష్ణ, చింతా పృద్వి, భూక్య బాలరాజు, భూక్య రవి, ప్రేమ్, రాజేష్, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: