CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మెగాస్టార్ చిరంజీవి ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి! జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర రావు!

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10... అంకితభావం కృషి దీక్ష దక్షతతో కఠోర పరిశ్రమ తో తన కష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాన్ని తన అద్భుతమైన నటనతో సద్వినియోగం చేసుకుని  అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మైటీ మెగాస్టార్ గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని  బ్లడ్ బ్యాంకు లను ఐ బ్యాంకు ను స్థాపించి లక్షలాది మందికి నేత్రదానం ని జీవితాలను ప్రసాదిస్తూ తన దయ కరుణ జాలి లతో  సమాజానికి ఇటు సినీ పరిశ్రమకు

విశిష్ట సేవలందిస్తున్న     మెగాస్టార్ చిరంజీవిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సినీ నటుడు చిరంజీవి అద్భుతంగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ నేపథ్యంలో అభ్యుదయ కళా సేవ సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ కేకును కట్ చేసి చిరంజీవి అభిమానుల మధ్య పూర్ణ సినిమా ధియేటర్ లో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ఇప్పుడు ఇటువంటి సూపర్ డూపర్ హిట్ అవసరమని  ఒక సినిమా హిట్ అయితే వందలాది కుటుంబాలు బాగుపడతాయని  ఇటువంటి గొప్ప నటుడు  నిరంతర సేవాతత్పరుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ   శ్రమను నమ్ముకొని నావెల్ టీ తో కూడిన నటనతో  దమ్ము చూపించి రికార్డులదుమ్ము దులిపే  మెగాస్టార్ చిరంజీవిని అప్రతిష్ఠ పాలు చేయాలని చూస్తున్నారని  వారి సినిమాలు విజయవంతం కాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని  వారు ఎవరైనా సరే వారి అంతు చూస్తా మనీ  అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు  దుర్మార్గులు అక్రమ కారులు  చిరంజీవి ని ఆపలేరు అని  హర్షధ్వానాల మధ్య హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో   పూర్ణ థియేటర్ మేనేజర్  శ్రీనివాస్  చిరంజీవి సేవా సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బి .విల్సన్ బాబు ,ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కాళిదాస్ అభ్యుదయ కళా సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి  అల్లి శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు సినీ నటులు 24 క్రాఫ్ట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తాండూర్ ధనరాజ్   జిల్లా కార్యదర్శి కే వాసు

జిల్లా ఆర్గనైజర్ స్టీఫెన్ లాజరస్ మహిళా జిల్లా కమిటీ సభ్యులు  ఆల్ఫాన్సా  నరేందర్ లాస్య  ఎస్టర్ ఇమాన్యుల్ గ్రేస్ విక్టోరియా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: