CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

Share it:


  •  పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి
  •  భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం
  • సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
  •  పాతకొత్తగూడెంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నాయకులు సాబీర్ పాష


మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08 ...పండుగలు, ఉత్సవాలు ప్రజల మద్య ఐక్యతకు, సోదరబాబాన్ని పెంపొందించేందుకు వేదిక కావాలిని సిపిఐ జిల్లా కార్యదర్శి,  ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పట్టణంలోని పాత కొత్తగూడెంలో దేవినవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. కులమతాలకతీతంగా అన్ని పండుగలు కలిసిమెలిసి నిర్వహించుకోవడం మన ప్రాంతంలోనే కాకుండా యావత్ భారతదేశంలో జరుపుకోవడం ఐక్యతకు నిదర్శనమన్నారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడమేకాకుండా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం, అందరిని ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమని, ఈ ఆనవాయితీను భవిష్యత్తులోనూ కొనసాగించి ప్రజల్లో ఐక్యతను పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, వై శ్రీనివాస్ రెడ్డి, కిలారు ప్రసాద్, భూక్య దస్రు, మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, జక్కుల రాములు, మురళి, కె. రత్నకుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: