CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాటి తెలంగాణ ఉద్యమకారుడికి సరైన గుర్తింపు

Share it:  • స్వరాష్ట ఉద్యమంలో గోవింద్ నాయక్ పాత్ర కీలకం.
  • ములుగు జిల్లాలోని మండలాల జడ్పిటిసిల ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పోరిక గోవింద్ నాయక్ కి సన్మానం.
  • ములుగు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్.

మన్యం న్యూస్ ములుగు

ములుగు జిల్లా గ్రంథాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా  జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ.

ఉద్యమ స్పూర్తి,పోరాటల గడ్డ ములుగు ప్రాంతం నుండి తెలంగాణ స్వరాష్ట సాధనే ఏకైక లక్ష్యంగా జరిగిన నాటి ఉద్యమంలో నేటి ములుగు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పోరిక గోవింద్ నాయక్  పాత్ర కీలకం అని అన్నారు.ఉద్యమాన గులాబీ జెండా మోస్తూ,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ,తెలంగాణ స్వరాష్ట సాధనలో ములుగు జిల్లా ప్రజానికాన్ని భాగస్వామ్యం చేయడానికి గోవింద్ నాయక్  కృషి మరువలేనిది అని అన్నారు.ఒకనొక సందర్భంలో తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసిన ఘనత గోవింద్ నాయక్  అని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాకారులకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమించారని, గులాబీ జెండా ధైర్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్,పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిన వారిలో గోవింద్ నాయక్ ఒకరని అన్నారు.

స్వరాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరవేయుటలో,ఇటు ప్రజాప్రతినిధులను,పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో గోవిందన్న చురుకుగా పని చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జరిగిన వివిధ రకాల ఎన్నికల్లో కూడా ములుగు ఇంఛార్జి గా వారి గెలుపులో ప్రత్యేకంగా నిలిచారని అన్నారు.ఈ ప్రాంత గులాబీ జెండాకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న గోవింద్ నాయక్ ను అధిష్టానం గుర్తించి గ్రంథాలయ ఛైర్మన్  నియమించడం సంతోషంగా ఉందని అన్నారు.

భవిష్యత్తులో ఇంకా ప్రజలతో మమేకమై,మరింత బాధ్యత గోవిందన్న పై ఉందని అన్నారు.

ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాను సారం పని చేసే నికార్సయిన గులాబీ జెండా నాయకులను,

కార్యకర్తలను సమాయత్తం చేయడంలో గోవింద్ నాయక్ పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.జిల్లా ప్రజలకు చూపరిచితుడైన గోవింద్ నాయక్  భవిష్యత్తులో మరిన్ని పదవుల్లో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వెంకటాపూర్  జడ్పిటిసి గై రుద్రమదేవి-అశోక్,

గోవిందరావు పేట జడ్పిటిసి తుమ్మల హరిబాబు,

వెంకటాపురం జడ్పిటిసి పాయం రమణ,వాజేడు జడ్పిటిసి తల్లాడి పుష్పలత పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: