CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యల పరిష్కారమే నా లక్ష్యం, మండలంలో సుడిగాలి పర్యటన చేసిన -ఎంఎల్ఏ మెచ్చా

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వరావుపేట మండలంలో బుధవారం పలు కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అశ్వారావుపేట క్యాంపు కార్యాలయంలో ఆసుపాక గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు వారి పోడు భూమి సమస్య పరిష్కారం చెయ్యాలని, 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం అని గత 6 సంవత్సరాల క్రితం అట్టి పోడు భూమిలోకి ఫారెస్ట్ అధికారులు వచ్చి గిరిజనులు సాగు చేసుకునే భూమి నుంచి కొంత బాగం అడగగా వారు స్వచందంగా కొంత భూమిని ఇచ్చారనీ, 2022 మార్చ్ వరుకు సాగు చేసుకుంటున్నారు అయితే ఏప్రిల్ ,మే నెలలో గ్రామంలో ఎవరు లేని సమయంలో ఫారెస్ట్ అధికారులు ట్రెంచ్ తవ్వి ఈ ఏడాది సాగు చెయ్యకుండా అడ్డుకున్నారనీ ట్రెంచ్ కొట్టడం వల్ల వాటిని సర్వే కూడా చెయ్యని పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని సమర్పించారు. అదే విదంగా కన్నాయిగుడెం, కావడిగుండ్ల, గాండ్లగూడెం, అనంతరం, పండువారిగుడెం గ్రామాలకు చెందిన గ్రామస్థులు ఎన్నో ఎండ్లుగా సాగు చేస్తున్న భూములకు కొత్త పాస్ పుస్తకాలు లేకపోవడం అలాగే ఆ భూములు రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల్లో కలిసి ఉండటం వళ్ళ ఈ సమస్యను పరిష్కరించి కొత్త పాస్ పుస్తకాలు ఇప్పించాలని అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావుని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా స్థానిక తహసీల్దార్ తో అలాగే రేంజర్ ని క్యాంపు కార్యాలయానికి పిలిపించి దీనిని సర్వే చెయ్యాలని ఉన్నత అధికారులతో మాట్లాడి కొత్త పాస్ పుస్తకాలు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గుమ్మడివల్లి గ్రామంలో సాయిల కొమరయ్య కుమార్తె ఒణిల వేడుకలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. అదే విదంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిమడబోయిన శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. ఆనంతరం నారాయణపురం గ్రామంలో లక్ష్మి నరసయ్య ఇటీవలే చికిత్స చేపించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు. జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి మామయ్య ఇటీవలే స్వర్గస్థులు అవ్వడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూకటి వెంకన్న ఇటీవలే స్వర్గస్థులు అవ్వడంతో ఈరోజు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉసుర్లగూడెం గ్రామంలో  ఉప్పల కోటేశ్వరరావు పాము కాటు కి గురై మృతి చెందగా ఈరోజు వారి నివాసానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, కాసాని చంద్ర మోహన్, నిర్మల పుల్లారావు, సర్పంచ్ నారం రాజ శేకర్, నులకాని శ్రీనివాస్ రావు, బిర్రం వెంకటేశ్వరరావు, వెంకట నరసింహం, కలపాలి శ్రీను, మోటురి మోహన్, సంపూర్ణ, ఆకుల శ్రీను, చిమిడిబోయిన పెద్ద వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సాయిల సత్యం, శ్రీను, కృష్ణార్జున రావు, బాబు, ప్రవీణ్, గిరి, శేకర్, గోపాల్, ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: