CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్ రేగా ఆదేశాలతో ప్రజల్లోకి - జిల్లా బాస్ సారథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి

Share it:

 



విప్ రేగా ఆదేశాలతో ప్రజల్లోకి

 - జిల్లా బాస్ సారథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 - బీఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి


సారపాక, అక్టోబర్ 25, మన్యం న్యూస్ : 

  

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,  పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు అతిత్వరలో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అద్యక్షులు గోపిరెడ్డి రమణా రెడ్డి తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అద్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మన్యం న్యూస్ తో మాట్లాడుతూ... రేగా కాంతరావు ఆదేశాలతో అతి త్వరలో ఇంటింటికీ కేసిఆర్ గ్రామ గ్రామానా బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అన్నీ గ్రామాల్లో ప్రతీ ఇంటికీ వెళ్ళి సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు గురించి తెలియజేస్తామని అన్నారు. అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. గతంలోనూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పలు గ్రామాలు పర్యటించడం జరిగిందన్నారు. అప్పుడు కరోనా పరిస్థితి దృష్ట్యా ఈ కార్యక్రమంలో నిలిపివేయడం జరిగిందన్నారు. మరలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో అతి త్వరలో ప్రారంభించనున్నట్లు వివరించారు. గతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా అంజనాపురం, జింకల గూడెం, మొరంపల్లి బంజర, వేపల గడ్డ,   ఉప్పుసాక, పినపాక పట్టి నగర్, ముసలిమడుగు, సింగారం గ్రామాల్లో పర్యటించామని వెల్లడించారు.  ఈ పర్యటనలో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన రోడ్లు, కరెంట్, డ్రైనేజీలు తదితర ప్రజా సమస్యలను ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించామని పేర్కొన్నారు.   


  - జిల్లా బాస్ సారథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి


          బీఆర్ఎస్ పార్టీ జిల్లా బాస్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సారధ్యంలో కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రైతులకు రైతుబంధు, తెలంగాణ ఆడబిడ్డలకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ల మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ, దళిత బంధు వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు.. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్లు, వైకుంఠ ధామాల నిర్మాణం, పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ, హరితహారం, మిషన్ భగీరథ వంటి తదితర అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుపరుస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు సైతం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: