CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గోవింద్ నాయక్

Share it:


మన్యం న్యూస్, ములుగు :

ములుగు జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్ పదవి రావడం తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాననని ములుగు జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ అన్నారు.బుధవారం జిల్లా నూతన గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం క్రియా శీలకంగా వ్యవహరించిన తనకు ముఖ్య మంత్రి,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గుర్తించి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలను తన మీద ఉన్న నమ్మకంతో ఉద్యమకారుడికి గుర్తింపును ఇవ్వాలని, గ్రంథాలయ చైర్మన్ గా నియమించినారని అన్నారు.నూతన గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నిక కావడానికి సహకరించిన వరంగల్ ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుకు,సత్యవతి రాథోడ్ కు,మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవితకు,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డికి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి,ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్,ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ రుణపడి ఉంటానని తెలిపారు.తన మీద ఉన్న నమ్మకంతో ఎన్నికకు సహకరించిన ములుగుజిల్లా జడ్పీటిసిలు,ఎంపిపిలు,మండల పార్టీ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనుక్షణం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అందరిని కలుపుకుపోయి పార్టీ పటిష్టతకు పాటుపడతానని రాబోయే రోజుల్లో ములుగు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: