CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములు క్షేత్రస్థాయిలో సర్వే జరపాలి

Share it:


👉 అక్రమాలకు తావు లేకుండా వాస్తవ సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి-ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నూపా భాస్కర్. 

మన్యం న్యూస్ :ములకలపల్లి (అక్టోంబర్13):

 మండలంలో సిపిఐ ఎంఎల్ ప్రజపంథా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల తహసీల్దార్ కు మెమొరాండం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నూపా భాస్కర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోడుభూమల సమస్య పరిష్కారానికి పూనుకోవడం, రాష్ట్రస్థాయిలో కమిటీ వేయడం,జిల్లా స్థాయిలో కూడా అధికారులను సమాయత్తం చేయడం జరుగుతుంది. ఈ పొడుభూముల పట్టాల సర్వె  సరైన పద్ధతిలో  జరగటం లేదని,కేవలం ఈ సర్వేలో మంత్రులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఫారెస్ట్,రెవిన్యూ, పోలీస్,అధికారులను మాత్రమే భాగస్వాములను చేయడం, స్థానిక ప్రతినిధులను,ఎఫ్ఆర్ సీ లను పోడు పోరాట ఉద్యమ సంఘాలను భాగస్వామ్యం చెయ్యాలని,అవినీతి అవకతవకలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వాస్తవిక సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని,గతంలో కూడా సాగు సంబంధంలేని వారికి పట్టాలిచ్చి అసలు సాగుదారులకు పట్టాలు ఇవ్వలేదని,అలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కల్లూరు కిషోర్,జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్, రాచన్నగూడెం సర్పంచ్ కోర్స గణపతి, పార్టీ మండల కమిటీ సభ్యులు నకిరికంటి నాగేష్, ప్రగతిశీల యువజన సంఘం డివిజన కార్యదర్శి కొర్స రామకృష్ణ,ఈసం విజయ్ రావు,బండారు ప్రసాద్ శివ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: