CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

అడివి పై హక్కు ఆదివాసి బిడ్డలదే- జడ్పీటీసీ పుష్పలత*

Share it:

  • అడివి పై హక్కు ఆదివాసి బిడ్డలదే- జడ్పీటీసీ పుష్పలత*
  • పోడు భూములు లాక్కుంటే పోరుబాట పడతాం-ఎంపీపీ సతీష్ కుమార్
  • పోడు సర్వే నిలిపివేస్తే ఊరుకునేది లేదు- ఎంపిపి శారద

మన్యం న్యూస్ అక్టోబర్ 25 వాజేడు.                                              

  ఆదివాసీలు జల్,జంగిల్, జమీన్  నినాదంతో పోరాటం చేసి, ప్రాణ త్యాగాలు చేసి   సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు అటవీ శాఖ అధికారులు కుట్ర చేయడం శోచనీయం.  నూగూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో ఒంటిమామిడి, బొల్లారం, మహితాపురం ఆదివాసీ పోడు రైతుల సాగును  అటవీశాఖ అధికారులు తరుచూ అడ్డుకోవడంతో వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజా ప్రతినిధులు అయిన జడ్పీటీసీ పుష్పలత,వెంకటాపురం మండల  ఎంపీపీ సతీష్ కుమార్, వాజేడు ఎంపీపీ శారద మంగళవారం మూడు గ్రామాల పోడు భూములను ఉమ్మడిగా క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. రెండు మండలాల కు చెందిన మూడు గ్రామాల ఆదివాసీ  పోడు  రైతులతో వారు మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వాజేడు జడ్పిటిసి తల్లడి పుష్పలత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కు పోడు హక్కు పత్రాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో  పోడు భూముల సర్వే చేపట్టిందని అన్నారు.    ఆదివాసీల ను అక్రమార్కులు , అడవి విధ్వంస కారకులు అని అటవీ శాఖ అధికారులు చిత్రీకరించడం  సరికాదని వాజేడు మండల జడ్పిటిసి తల్లడి పుష్పలత అన్నారు. ఆదివాసీల హక్కులను అడ్డుకునే అధికారం అధికారులకు లేదన్నారు. అధికారుల అత్యుత్సాహం తో ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని ఆమె హితువు పలికారు. వెంకటాపురం ఎంపీపీ చెరుకూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీలు  ఎన్నో ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న భూములను, అటవీ భూములు అని ఆదివాసీలను భయపెట్టించి ,ఆదివాసీ మహిళా రైతల మీద అనుషిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆదివాసీలు పట్టాలు కలిగి ఉండి వేసిన పంటలో పురుగు మందులు పిచికారీ చేయకుండా, ప్రతి ఏటా వేసే మొక్కజొన్న పంటలు వేయకుండా అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారుల పైన ఆయన మండిపడ్డారు. ప్రతి ఏటా వేసి ఆదివాసీ సాంప్రదాయ పంటలైన పెసర, జనుము, కొర్రలు వేయకుండా అడ్డుకుంటే ఆదివాసీలు బ్రతికేది ఎలా అని ప్రశ్నించారు. ఛాయా చిత్రాల ఆధారంగా ఆదివాసీల అటవీ హక్కుల చట్టాన్ని అడ్డుకోవాలని చూడటం చట్ట రీత్యా నేరం అన్నారు. సెక్షన్ 12(10) ప్రకారం సాంకేతిక కారణాలను చూపి సాగు హక్కుని అడ్డుకోరాదని తెలియజేశారు. ఎఫ్ ఆర్ సి కమిటీలు ,పెసా కమిటీలకు రాజ్యాంగ బద్ధత ఉందన్నారు. కమిటీల అభిప్రాయం మేరకు మాత్రమే అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటవీ హక్కుల కమిటీలను, పెసా కమిటీలను సంప్రదించకుండా ఆదివాసుల పైన కేసులు పెట్టడం ఏమిటని ఆయన తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.  పట్టా భూములను దున్నుకొని మొక్కజొన్న పంట వేయకుండా అడ్డుకుంటే ప్రతిఘటన తప్పదన్నారు. పోడు భూములు లాక్కుంటే పోరుబాట పడతామని ఆయన అధికారులను హెచ్చరించారు. ఆదివాసీలు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వాజేడు ఎంపీపీ శారద అన్నారు. అటవీ శాఖ అధికారులు పోడు సాగుదరులను ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దని కోరడం జరిగింది. ,ప్రభుత్వం ఆదివాసీల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. అటవీ శాఖ అధికారులు ఆదివాసీల పట్ల సంయమనం పాటించాలన్నారు. బేస్ క్యాంపులు పెట్టి ఆదివాసీల ను దొంగలుగా చిత్రీకరించొద్దని వ్యాఖ్యానించారు. ఆదివాసీ పోడు రైతు కంతి విజయ్ మాట్లాడుతూ ఆదివాసీలకు అడవికి అవినాభావ సంబంధం ఉందన్నారు. కావాలనే అటవీశాఖ అధికారులు ఆదివాసీలను అక్రమార్కులు అని చిత్రీకరిస్తున్నారు అని అన్నారు. 5 వ షెడ్యూల్డ్ భూభాగంలోకి వలస వచ్చిన గిరిజనేతరులు అసలైన అక్రమార్కులు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను అక్రమంగా వన్.ఆఫ్ చట్ట విరుద్ధంగా సాగు చేసుకుంటున్న వలస గిరిజనేతరులు నిజమైన అక్రమార్కులు అన్నారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న గిరిజనేతరుల కబ్జాలో వందలాది ఎకరాలు అటవీ భూమి మూలుగు తోందన్నారు. అటవీ భూములు అక్రమంగా సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల పైన ఎటువంటి కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు., కబ్జా కోరులు అని అటవీ శాఖ అధికారులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అధికారులు కావాలనే నూగూరు బీట్ లో సర్వే నిలిపివేశారు అని మండిపడ్డారు. మా భూముల ను లాక్కోవలని చూస్తే అధికారుల పైన ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్లగూడెం సర్పంచి కొర్శా నర్సింహమూర్తి, ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, మహితపురం, ఒంటిమామిడి, బొల్లారం ఎఫ్.ఆర్.సి.కమిటీలు, పెసా కమిటీలు ,సుమారు 300 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.

పోడు భూములు లాక్కుంటే పోరుబాట పడతాం-ఎంపీపీ సతీష్ కుమార్

పోడు సర్వే నిలిపివేస్తే ఊరుకునేది లేదు- ఎంపిపి శారద

TELANGANA

Post A Comment: