CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే..

Share it:


మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 6) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  (1996-1997 ) నాటి విద్యార్థులు ఈ నాటి పలువురు ప్రముఖులు ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులేనని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1996 - 97 మధ్య  పదో తరగతి చదువుకున్న విద్యార్థులు దేశ, విదేశాలలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలో స్థిరపడిన వారు గురువారం మండలంలోని యల్లంకి గార్డెన్ లో ఒకే చోట కలుసుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి మరపురాని మధురమైన సంఘటనలు, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకుని ఆద్యంతం ఉల్లాసంగా, సంతోషంగా గడిపారు. దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం అంటూ ఆనంద భాష్పాలతో వారి గత అనుభవాలను నెమరు వేసుకున్నారు.

క్లాస్ మేట్స్, బెంచ్ మేట్సు ఆత్మీయ ఆలింగనంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థులు స్వర్ణం నర్సింహారావు మాట్లాడుతూ.. మిగిలిన స్నేహితులుతో నెల నెలా ప్రతి ఒక్కరూ కలిసి ఎవరైనా అనారోగ్య కారణంతో, ఆర్థికంగా సతమతమవుతున్న వారికి, చదువుకునే వారికి ఆర్దిక సహాయం అందిస్తామని తెలియజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరి నొకరు ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా గడిపారు. వివిధ రంగాలలో తమ స్నేహితులు మంచి హోదాలో ఉండడం, కొందరు స్వయం ఉపాధిలో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గ్రూప్ ఫొటోలు దిగి కొంగొత్త జ్ఞాపకాలు పథిలం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు స్వర్ణం నర్సింహారావు, టి నవీన్, వై రామాచారి, చీకటి ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, పెరసాని రంజిత్, వరలక్ష్మి, పాలెపు సత్యనారాయణ, నూర్జహాన్, మధార్బీ, జ్యోతి, నున్నా నర్సింహారావు, బండ్ల వెంకటేశ్వరరావు, రంజిత్, కలిశెట్టి వెంకటేశ్వరరావు, సాయిల రమేష్, ఎం వెంకటేశ్వరరావు, బి నవీన్, రాయి నిర్మల, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: