CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి గ్రామాలలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు.. కొమరం భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ..

Share it:


జూలూరుపాడు, అక్టోబర్ 29, (మన్యం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొమరం భీమ్ 121వ, జయంతి వేడుకల్లో భాగంగా మండల పరిధిలోని 17 ఆదివాసి గ్రామాలలో ఆయా గ్రామాల ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం నుండి పాపకొల్లు క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడలిలో ఆదివాసి జెండా ఆవిష్కరణ అనంతరం. ఆదివాసీ నాయకులు కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల లేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొమరం

భీమ్ జల్, జంగిల్, జమీన్ పై సర్వహక్కులు ఆదివాసీలు కు మాత్రమే చెందాలనే  నిదానంతో నిజాం నిరంకుశత్వ పరిపాలనకు, ఆరాచక విధానలకు, ధోపిడి, కి వ్యతిరేకంగా సాయుధ తిరుగుపాటు  ఉద్యమం చేసినా గొప్ప ఆదివాసీ ఉద్యమ వీరుడని కొనియాడారు. ప్రస్తుత యువత కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసీ హక్కులు కోసం, జాతి అస్థిత్వం కోసం, జాతి ప్రయోజనాలు కోసం నిరంతరము పోరాట పంధాను కొనసాగిస్తు, ఆయన ఆశయ సాధన  కొరకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆదివాసి హక్కులు, చట్టాలు, సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు, వైద్య, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ ఐక్యత తో అభివృద్ధి చెందాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను అన్ని రకాలుగా అణచివేతలకు గురి చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వాలని, ఇండ్లు లేని పేదలకు పక్కా ఇండ్లు మంజూరీ చేయాలని, గిరిజన బంధు పథకం అమలు చేసి, ఆదివాసీలను ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్లం నరసింహరావు దొర, వాసం శ్రీకాంత్, బచ్చల లక్ష్మయ్య, పూసం సుధీర్, అరెం రామయ్య, కోడెం సీతా కుమారి, సిద్దబోయిన రామ్మూర్తి, సిద్ధ బోయిన  పుల్లారావు, మోహన్, మల్కం వీరభద్రం, సోడే శ్రీరామ్, పూనెం రాధాకృష్ణ,  ఇరుప రామారావు, పూనమ్ సూరయ్య, కట్రం ప్రసాద్, మడి రవి, తదితర గ్రామాల ఆదివాసి యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: