CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విధుల్లోకి వీఆర్ఏలు.

Share it:


మన్యం న్యూస్ అక్టోబర్ 13 వెంకటాపురం: గత కొద్దీ కాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు తమ డిమాండ్ల సాధనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్  కుమార్ తో నేడు బీఆర్ కేఆర్ భవన్ లో సమావేశమయ్యారు.  సీసీఎల్ ఏ డైరెక్టర్ రజత్ కుమార్ సైనీ సమక్షంలో జరిగిన ఈ చర్చలకు వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వీఆర్ఏ ల డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తి వేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. 

     ఈ సందర్బంగా వీఆర్ఏ లు పలు డిమాండ్లను సి.ఎస్ కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మే కాలానికి వేతనం ఇప్పించడం, కేసులు ఎత్తివేయడం, సమ్మె కాలాన్నిప్రత్యేక సెలవుదినంగా ప్రకటించడం. సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏ ల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను తెలిపారు. ఇట్టి సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టమైనహామీ ఇవ్వడంతో ఈ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు ఈ సమ్మెను విరమించి మండల వీఆర్ఏలు అందరూ విధుల్లోజాయిన్ అవడం జరిగినది.

  వెంకటాపురం నూగూరుమండల వీఆర్ఏలు మండల  అధ్యక్షులు కంటెం బలరాములు,ఉపాధ్యక్షులు రేగ రాజేష్ ,కార్యదర్శి ఉండం శిరీష ,అరుణ , రజిత,సమ్మక్క , సమ్మయ్య  ,రామస్వామి,ముసలయ్య,తిరుపతమ్మ ,లక్ష్మయ్య ,కళ్యాణి , బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: