CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సర్వే పురోగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య

Share it:


మన్యం న్యూస్, ములుగు : 

ములుగు జిల్లా లో పోడు భూములకు పట్టాలు జారీకై క్షేత్ర స్థాయిలో ఆర్ఓఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన పోడు భూముల సర్వే పురోగతిని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ అదిత్య సంబంధిత మండల ప్రత్యేక అధికారులు,తహసీల్దార్లు,ఎంపిడిఓలు, ఫారెస్ట్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ నుండి జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య పోడు క్లెయిమ్ ల పరిశీలన పురోగతిని సంబంధిత అధికారులతో మండలాల వారీగా సమీక్షిస్తూ జిల్లాలో ఉన్న 9 మండలాల్లోని సంబంధిత గ్రామాలకు సర్వే బృందాలు వెళ్లి పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ఆర్ఓఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా నవంబర్ 5 వరకు పూర్తి చేయాలని అన్నారు.జిల్లాలోని మొత్తం 9 మండలాలలో 34082 దరఖాస్తులు స్వీకరించగా ఇప్పటి వరకు 58 శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగిందని మిగతా సర్వే పనులన్నింటినీ వేగవంతం చేసి నవంబర్ 5 వరకు తాహసిల్దార్లు,ఎంపిడిఓలు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. 


ప్రతిరోజు మండలం వారిగా 200 దరఖాస్తులను పరిష్కరించాలని అన్నారు.పూర్తి చేసిన సర్వే పనులను ఎప్పటికప్పుడు యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు పనులు క్షేత్రస్థాయిలో  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు.పరిష్కారం కోసం గ్రామ కమిటీల ద్వారా సమావేశాలు నిర్వహించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతిరోజు పూర్తి చేసిన పనులను ఆన్లైన్ ద్వారా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఇట్టి పనులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని,విధుల పట్ల అలసత్ల్వం ప్రదర్శిస్తే సస్పెండ్ కు వెనుకాబడబోమని హెచ్చరించారు.అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఎంతోకాలంగా పోడు భూములు సాగుచేస్తున్న గిరిజనులు,గిరిజనేతరులకు పట్టాలు అందించడంలో తమ వంతు పూర్తి సహాకారం అందించాలని అన్నారు.క్లెయిమ్స్ సమర్పించినా సాగులో లేని పోడు భూములను దరఖాస్తులను క్లోజ్ చేయాలని సూచించారు. ఖచ్చితంగా సాగుచేస్తున్న  ఏ వ్యక్తి నష్టపోకుండా చూడవలసిన వలసిన భాద్యత మనపై ఉందని అన్నారు.అధికారులు వారికి న్యాయం చేస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్,జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి, మండల ప్రత్యేక అధికారులు,తహసీల్దార్లు, ఎంపిడిఓలు,ఫారెస్ట్ అధికారులు,ఈడీఎం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: