CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శ్రీ నిధి,సంస్థలో అవినీతి గుట్టు రట్టు.

Share it:


*శ్రీ నిధి,సంస్థలో అవినీతి గుట్టు రట్టు.

 *ఏజెన్సీలో డ్వాక్రా మహిళా సంఘాలే టార్గెట్, 5000, నుండి 10000 వసూల్.

*నిధి ఇస్తేనే శ్రీనిధి లోన్ వి ఓ ఏ వ్యవహార శైలి. 

* శ్రీనిధి లోన్ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా అభివృద్ధి సాధికారితే లక్ష్యం.

*శ్రీనిధి లోన్ లక్ష్యాన్ని అవినీతిమయం చేస్తున్న సంస్థ అధికారులు. 


మన్యం న్యూస్, వాజేడు
: అక్టోబరు 23: 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వయం సాధికారిత లక్ష్యంగా మహిళా స్వయం సమృద్ధి సాధికారిక శ్రీ నిధి సంస్థను స్థాపించి .మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడం, మహిళా సాధికారతే లక్ష్యంగా శ్రీనిధి సంస్ధ పనిచేస్తున్నదని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. మహిళా సంఘాల సభ్యులందరికీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనుటకు, మహిళా మణుల జీవన ఉపాధి అభివృద్ధి సాధించే దిశగా శ్రీనిధి లాంటి సంస్థలు ముందుకు వచ్చి మహిళలకు రుణాలు ఇచ్చి మహిళల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో స్వతంత్రoగా సొసైటీలో పేరు ప్రఖ్యాతలు సాధించినప్పుడు మహిళలకు గౌరవం, ఈ సంస్థ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. కానీ సెర్పు మండల స్థాయి అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాలను ఆసరాగా చేసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు.  శ్రీనిధి లోను రుణాలు మంజూరు చేయాలంటే డ్వాక్రా మహిళా సంఘంలో ఎవరెవరికి రుణాలు కావాలో వారు ప్రతి ఒక్కరు 5000 రూపాయలు శ్రీనిధి సెర్పు అధికారులకు సమర్పించవలసిందే, కాదంటే శ్రీనిధి రుణం లేదంట, అంటూ వారి వ్యవహార శైలి ఉంటుంది. అలా 36 మంది సభ్యురాల ఒక్కొక్క సభ్యురాలు నుండి 5000  వరకు డిపాజిట్ల పేరుతో వసూలకు పాలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వివరాలకు వెళితే మండల కేంద్రంలోని చండ్రుపట్ల పంచాయతీలోని 36 మంది సభ్యులతో శ్రీనిధి లోను మంజూరు చేస్తామని అమాయకులను ఆసరాగా చేసుకొని సెర్పు అధికారులు డిపాజిట్ల పేరుతో ఒక్కొక్కరి దగ్గర రూ.5000 రూపాయలు దండుకొని. సభ్యురాలకు 50 వేల రూపాయల లోన్ మంజూరు చేశారు. 50,000  కట్టిన తర్వాత మళ్లీ శ్రీనిధి లోన్లు ఇస్తామని మరో కొంతమంది సభ్యుల నుండి 10,000 రూపాయలు డిపాజిట్ల పేరుతో తీసుకొని సంవత్సరాలు గడుస్తున్న శ్రీనిధి లోన్ మంజూరు కాకపోవడంతో, మా నుండి డిపాజిట్ల పేరుతో పదివేల రూపాయలను తిరిగి ఇవ్వవలసిందిగా ఏపిఎం ని అడిగారు ఆయన స్పందించకపోవడంతో సభ్యులు అసలు సిసలైన కథ బయటపడింది. మీ నుండి తీసుకున్న 5000, రూపాయలను సంస్థలో చాలా మందికి భాగస్వామ్యం ఉందని వి ఓ ఏ అన్నారు. ఏ పి ఏం సార్ తో సహా అందరూ తీసుకున్నారని చెప్పడంతో, సభ్యులకు అసలు కారణం తెలిసింది . ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన లబ్ధిదారులు, మీడియాను ఆశ్రయించారు.  సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని , ఈ ఒక్క గ్రామంలో  కాకుండా అన్ని గ్రామాలలో ఇదే  కొనసాగుతుందని, శ్రీనిధి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అవితికి అధికారులపై చర్యలు తీసుకొని వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: