CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సర్వే పాదదర్శకంగా ఉండాలి -సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ షాబీర్ పాష

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే పారదర్శకంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ షేక్ సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అశ్వరావుపేట లోని సయ్యద్ మియా జానీ భవనంలో ఆ పార్టీ మండల కౌన్సిల్ సమావేశం జరిగింది మండల కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నిరంతర పోడు భూములు పోరాటంలో అనేకమంది గిరిజనులు నిరుపేదలైన వారు పోడు నరుక్కుని వ్యవసాయం చేసుకొని జీవన ఆధారం పొందుతున్నారు అన్నారు. చట్ట ప్రకారం అందరికీ సమగ్రంగా పారిదర్శకంగా ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వేను నిర్వహించి అందరికీ పోడు హక్కులు కల్పించాలని గత 20 సంవత్సరాలకు పైగా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారని నిబంధనల పేరుతో ఎవర్ని తొలగించకుండా పోడు సాగుదారుల దరఖాస్తుల ప్రకారం అందరికీ భూములు అందించాలని సూచించారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో జరిగే జాతీయ మహాసభలు సందర్భంగా తలపెట్టిన బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు కర్షకులు పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలందరూ ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ధరల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ జాతీయ మహాసభల బహిరంగ సభకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది కమ్యూనిస్టు యోధులు హాజరవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, మహమ్మద్ మున్నా, టి సంజయ్, టిఓసిటి శివశంకర్, మహిళా మండల్ నుంచి చీపుర్ల సత్యవతి, తనగాల వరలక్ష్మి, ఏఐటీయూసీ డివిజన్ నాయకులు తిరునాతి సత్యనారాయణ, కారు యూనియన్ నుంచి నాగేశ్వరరావు, సురేష్, శేఖర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: