CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా గిరిజన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

Share it:


 ఘనంగా గిరిజన రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

*క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి.

*క్రీడలు నిబద్ధతతో ఆడాలి.

*గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చింగ్తూ.

మన్యం న్యూస్ ఏటూరునాగారం 

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్. ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు.ములుగు జిల్లాలోని ఐటిడిఏ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో మంగళవారం మూడవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది.పూలమాలలు బుకే అందించి ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. దింసా నృత్యం,బంజారా డాన్సులతో,స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంచనాలతో ముఖ్య అతిథులుగా హాజరైన అధికారులకు క్రీడా ప్రాంగణం వేదిక వద్దకు తీసుకొని వెళ్లారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. శాంతి సూచికంగా కపోతాలను ఎగురవేసి కొమురం భీమ్ స్టేడియంలో ఘనంగా రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలను ప్రారంభించారు అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. క్రీడాకారులు జ్యోతి ప్రజ్వాలతో పరిగెత్తుకుంటూ వచ్చి జ్యోతిని అధికారులతో కలిసి వెలిగించారు. క్రీడా మైదానంలో వివిధ జోన్ల నుండి వచ్చిన క్రీడాకారులతో మాట్లాడి మొదటగా వాలీబాల్ క్రీడను గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిష్టినా చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు హాజరైన అధికారులకు ప్రజాప్రతినిధులకు సేల్స్ అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు మీ ప్రాంతాలలో మంచి క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి క్రీడలలో గెలుపొంది రాష్ట్రస్థాయి క్రీడలకు హాజరూ కావడం జరిగిందని అన్నారు. క్రమశిక్షణ నిబద్ధతతో క్రీడలలో రాణించే విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంటూ మీ విజయం  సాధించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఎవరైతే క్రీడలలో బాగా ఆడుతారో వారు చదువులో కూడా బాగా చదువుతారని అన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలలో.1650 మంది క్రీడాకారులు.168 మంది వ్యాయామ ఉపాధ్యాయులు. ఇతర సహాయకులుగా 350 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భోజన వసతి సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. జోనల్ 1, ఐటిడిఏ భద్రాచలం నుండి కొత్తగూడెం,ఖమ్మం, జూన్ 2,ఐటిడిఏ ఏటూరు నాగారం నుండి ఉమ్మడి వరంగల్,జోన్ 3, ఉట్నూర్ నుండి అదిలాబాద్, నిర్మల్,మంచిర్యాల ఆసిఫాబాద్,కరీంనగర్,జోన్ నాలుగు ఉట్నూర్,జోన్ 5, ప్లేన్ ఏరియా నుండి నల్గొండ, సూర్యాపేట,యాదగిరి. మహబూబ్ నగర్, నారాయణపేట,వనపర్తి, గద్వాల్,నాగర్ కర్నూల్,జోన్ 6 నుండి వికారాబాద్ .మేడ్చల్ మెదక్. సిద్దిపేట్ .నిజాంబాద్ సంగారెడ్డి. కామారెడ్డి హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల నుండి క్రీడాకారులు కబడ్డీ,ఖో ఖో,వాలీబాల్,టెన్నికాయిడ్, ఆర్చరీ,అథ్లెటిక్,క్యారం క్రీడా పోటీలు అండర్ 14 అండర్ 17 విభాగాలలో,డివిజన్ జోనల్ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనబరిచి గెలుపొంది నిపుణులతో ప్రత్యక్ష శిక్షణ పొంది రాష్ట్రస్థాయి క్రీడలలో పాల్గొంటున్నారన్నారు. ఇట్టి క్రీడాకారులకు బాలికలకు మూడు కేంద్రాల్లో వసతి బాలురకు నాలుగు కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసి. క్రీడాకారులకు బ్రేక్ ఫాస్ట్ అరటిపండు గుడ్డు, పాలు బూస్ట్ ఎనర్జీ డ్రింక్ తో పాటు మధ్యాహ్నం భోజనము రాత్రి చికెన్ తో భోజనము సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి క్రీడాకారులకు క్రీడా దుస్తులు ఇవ్వడం జరిగిందని. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రీడా నిబద్ధతతో ఆడాలని గెలిచిన వారిని ఇంటర్ స్టేట్ మీట్లో ఆడించడం జరుగుతుందని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు,ఏటూరు నాగారం ఎస్పీ అశోక్ కుమార్,ఏవో దామోదర రఘు స్వామి,డి టి డి వో లు.పోచం,మంకిడి ఎర్రయ్య,జహీరుద్దీన్,

రమాదేవి, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబి, ఎంపీపీ అంతటి విజయ, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ఏ టి డి ఓ దేశి రామ్, ఏ సి ఎం ఓ లు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,వ్యాయామ ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: