CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలి. వెంకటేశ్వరకాలని నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, ధర్నా. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం.

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10 ... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలని లో 137సర్వేనెంబర్ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు కనకయ్య, జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు స్థానిక వెంకటేశ్వర కాలని నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చుంచుపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పేదలు బ్రతుకు తెరువు కోసం వచ్చి జిల్లా కేంద్రంలో కిరాయి ఇండ్ల లో నివసిస్తున్నారని,ఆ పేదలు ఇంటి స్థలం కోసం గత రెండు సంవత్సరాలుగా కరెంట్ లేకపోయినా,విష సర్పాల మద్య ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారని అన్నారు.మానవతా దృక్పథంతో పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, సీఐటీయూ జిల్లా నాయకులు లిక్కి బాలరాజు, భూక్యా రమేష్ లు మాట్లాడుతూ ఇంటి స్థలాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్పారు, పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు, అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు, తహసీల్దార్ ప్రజలతో పోన్ ద్వారా మాట్లాడారు, స్వయంగా తాను వచ్చి పరిశీలిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా ను విరమించారు,ఈ కార్యక్రమంలో నాయకులు ఈసం నరసింహారావు, వీరభద్రం, రాంబాబు, బాలకృష్ణ రామకృష్ణ,నాగమణి,వసంత,నాగదుర్గ,వీరమ్మ, మోకాళ్ళ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: