CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి దరఖాస్తుకు జవాబుదారీగా ఉండాలి ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనుదిప్

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10... ప్రజావాణిలో వివిధ సమస్యల పట్ల ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తుకు ఆయా శాఖల అధికారులు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సుజాతనగర్ మండలం గారి పేట గ్రామానికి చెందిన రేవల్లి సత్యవతి వికలాంగురాలు పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకున్నానని తనకు పింఛను మంజూరు కాలేదని చాలా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టరేట్ ఎదుట మొరపెట్టుకున్నారు. తక్షణమే కలెక్టర్ ఆ దరఖాస్తు ఆన్లైన్లో పరిశీలించి పింఛన్ మంజూరు కోసం డి ఆర్ డి ఓ అధికారికి ఆదేశించారు. అశ్వారావు పేట మండలం పెరాయి గూడెం గ్రామానికి చెందిన ముప్పిడి ధైవరావు సర్వే నెంబర్ 1225 ఉన్న మూడు ఎకరాల భూమి ఉందని అట్టి భూమిని అదే గ్రామానికి చెందిన బొడ్డపాటి ప్రసాద్కు 2017న ఆరు సంవత్సరాల కాలం పాటు కౌలు ఇచ్చానని 2021 ఆగస్టు నెలలో కౌలు కాలపరిమితి తీరి పోవడంతో తన భూమి తనకు ఇవ్వాలని కోరగా ఇవ్వకుండా సరిహద్దు రాళ్లను తొలగించి దాడి చేశారని భూమి లోకి వస్తే చంపేస్తామని బెదిరించారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దరఖాస్తులు పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. పెనుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన narukulla నాగలక్ష్మి మద్దుకూరు రెవెన్యూ దాఖలాలలో సర్వేనెంబర్ 194/ఆ1లో రెండు గుంటలు వ్యవసాయ భూమి పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చారని తన పేరు మీద పడ్డ కూడా ఉందని నెట్వర్క్ భూమిని తన స్వాధీనం ఉన్నదని 2021 సంవత్సరం వరకు రైతుబంధు కూడా పొందానని అన్నారు. రైల్వే లైన్ సర్వే చేసిన తదుపరి నుంచి రైతుబంధు నిలిపివేశారని విచారణ నిర్వహించి రైతుబంధు పునరుద్ధరణ చూపించారని దరఖాస్తు దారుడు కోరగా తగు చర్య నిమిత్తం అధికారులను కలెక్టర్ ఆదేశించి సరైన న్యాయం చేయాలన్నారు. ప్రజావాణి లో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయరాదని నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యా లత, డిఆర్దిఓ మధుసూదనరాజు, డిపిఓ రమాకాంత్, మహిళా సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, పి ఆర్ డి ఈ సుధాకర్ ,మంగ్య, ఉద్యానవన అధికారి మరియున్న , డి ఆర్ వో అశోక్ చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలత ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: