CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమ్ము డాన్స్ లో తెలంగాణ రాష్ట్రపరిధిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ చర్ల కు ప్రధమ బహుమతి

Share it:


 మన్యం న్యూస్, చర్ల : 

తెలంగాణ రాష్ట్రపరిధిలో ఉన్న 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లకు ఈనెల 12, 13 తేదీల్లో కరీంనగర్ లో  రాష్ట్రస్థాయి సాంస్కృతిక పండుగ కార్యక్రమాలు జరిగాయి.ఈ రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో కొమ్ము ఆదివాసి గిరిజన డాన్స్ లో మరియు ట్రైబల్ సంగీత పరికరాల ప్రదర్శనలో ప్రధమ,ద్వితీయ బహుమతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గెలుపొందడం జరిగింది.అంతే కాకుండా జాతీయ స్థాయిలో సాంస్కృతిక పండుగల కార్యక్రమాలకు చర్ల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సెలక్ట్ కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రథమ  సాధించినందుకు మరియు జాతీయ స్థాయి లో సెలెక్ట్ అయినందుకు పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల బృందాన్ని భద్రాచలం ఐటిడిఎ పి.ఓ గౌతమ్ మరియు ఏపీవో డేవిడ్ రాజ్అభినందించారు అని పాఠశాల ప్రిన్సిపల్ శకుంతల తెలపడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: