CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బి ఆర్ ఎస్ అంటే బాధ్యత భరోసా

Share it:

 


బి ఆర్ ఎస్ అంటే బాధ్యత భరోసా

ప్రభుత్వ విప్ రేగా నేతృత్వంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు

దేశంలోనే అగ్రగామిగా బీఆర్ఎస్ నిలబడుతుంది

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 14... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావితరాల భవిష్యత్ కోసం సరికొత్త రూపం దాల్చిన భారత రాష్ట్ర సమితి( బి ఆర్ ఎస్) దేశంలో అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా బాధ్యతగా పరిపాలన కొనసాగించి దేశంలోనే అగ్రగామిగా బీఆర్ఎస్ నిలవడం తధ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యేగా క్యాంపు కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది కుటుంబాలు పార్లపల్లి ప్రాంతం నుంచి వచ్చి బి ఆర్ ఎస్ కండువాలు కప్పుకుని ఎమ్మెల్యే రేగా సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల పార్టీలు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ బీఆర్ఎస్ పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. గతంలో కొందరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల కాదని అవహేళన చేసినవారే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును చూసి ఆశ్చర్య పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలకు ముగ్ధులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బి ఆర్ ఎస్ పార్టీలో కి ప్రజలు వచ్చి చేరుతున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన పాలనతో ఇచ్చిన హామీలను కచ్చితంగా తీర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను ప్రజలు నిండైన మనసుతో స్వాగతిస్తున్నారని అన్నారు. పోడు భూముల పట్టాలు మంజూరు విషయంలో ప్రగల్భాలు పలికిన విపక్షాలు  నోళ్ళు వెళ్ళబెట్టి కునే పరిస్థితికి వచ్చారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములను ప్రత్యేక సర్వే చేయించి గత కొన్ని ఏళ్ళ కాలం నుంచి పోడు సాగు చేసుకుంటున్న రైతులకు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక సర్వే రాష్ట్రమంతా జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం మన్యం బిడ్డగా ముఖ్యమంత్రి కెసిఆర్ అనుచరుడుగా తాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికల్లో ముమ్మాటికీ బి ఆర్ ఎస్ పార్టీదే విజయమని ఇతర పార్టీలు బేజారు కావడం తధ్యమని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వెన్నుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: